అనంతలో వరద బాధితులకు తక్షణ సహాయం రూ. 2 వేలు: ఏపీ సీఎం జగన్ ఆదేశం

అనంతపురం జిల్లాలో వర్షం, వరద బాధితులను ఆదుకొనేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మరో వైపు  వరద బాధితులకు  తక్షణ సహాయంగా రూ. 2 వేలు అందించాలని సీఎం కోరారు. 

Give Rs. 2000To Each flood hit Family:APCM YS Jagan

అనంతపురం: అనంతపురం జిల్లాలో భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. వరద బాధితులకుతక్షణ సహాయంగా రూ.  2 వేలు చెల్లించాలని  సీఎం జగన్  అధికారులను కోరారు.

అనంతపురంలో భారీ వర్షంతో పలు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. వరద పరిస్థితిపై సీఎం జగన్ గురువారం నాడు అధికారులతో సమీక్షించారు.  అనంతపురంలో వరద పరిస్థితిపై అధికారులు సీఎంకు వివరించారు. అనంతపురంలో చేపట్టినసహాయక  చర్యల గురించికూడా అధికారులు సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. వర్షాలు, వరదల కారణంగా నిర్వాసితులైన వారిని ఆదుకోవాలని  సీఎం జగన్ ఆదేశించారు

. ప్రతి  కుటుంబానికి  బియ్యం,  పామోలిన్ ఆయిల్, కందిపప్పు,బంగాళాదుంపలు,ఉల్లిపాయలను అందించాలని సీఎం కోరారు. వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టగానే ఆస్తి, పంటనష్టంపై అంచనాలు తయారుచేయాలన్నారు. అంతేకాదు నిర్ణీత సమయంలోపుగా పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు సీఎం జగన్.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు మూడు రోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి.  భారీవర్షాలతో కాటిగాని చెరువుకు భారీగా వరద నీరుచేరింది. దీంతోచెరువుకు అధికారులు గండికొట్టారు. ఈ చెరువు నుండి కుక్కలపల్లి చెరువుకు వరద పెరిగింది. నడిమవంకకు  వరద పెరిగింది.భారీ వర్షాలతో అనంతపురం పట్టణంలోని 15 కాలనీలు నీటిలో మునిగిపోయాయి. బోట్ల ద్వారా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.   పలు కాలనీల్లో 5అడుగుల మేర వరద నీరు  ప్రవహిస్తుంది. బుధవారం నాడు రాత్రి నుండి వరద ప్రవాహంఅంతకంతకు పెరుగుతుంది.దీంతో ముంపు ప్రాంతాల ప్రజలను  అధికారులు పునరావాసకేంద్రాలకు తరలిస్తున్నారు.

also read:ఏపీ, తెలంగాణలకు మరో రెండు రోజులు భారీవర్ష సూచన: ఆందోళనలో లోతట్టు ప్రాంత వాసులు

 జిల్లాలోని బుక్కరాయసముద్రం మరువవంకలో సిమెంట్ లారీ కాజ్ వే పై నుండి వరద నీటిలో పడిపోయింది.ఈ ప్రమాదం నుండి డ్రైవర్  సురక్షితంగా బయటపడ్డాడు.  రాఫ్తాడు నియోజకవర్గంలోని వాగులు, చెరువులు నిండి  అనంతపురం పట్టణానికి వరద నీరు ప్రవహిస్తుంది.అనంతపురం పట్టణంలోని శివారు కాలనీలకు ప్రమాదం పొంచి ఉంది. అనంతపురం పట్టణంలలోని ఐదుప్రాంతాల్లో పునరావాసకేంద్రాలను ఏర్పాటుచేశారు.  వరద ముంపు ప్రాంతవాసులను ఈ పునరావాస కేంద్రాలకు తరలించారు.

అనంతపురం, అనంతపురం రూరల్ మండలాల్లోని విద్యా సంస్థలకు అధికారులు  ఇవాళ సెలవు ప్రకటించారు. మరో వైపు జేఎన్ టీయూ పరిధిలో ఇవాళ జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios