Asianet News TeluguAsianet News Telugu

సారా తాగించి ఒకరి తర్వాత ఒకరు యువతిపై అత్యాచారం

బంధువుల ఇంటికి శుభకార్యానికి వచ్చిన యువతిపై ముగ్గురు కామాంధులు  అఘాయిత్యానికి పాల్పడ్డారు. యువతికి సారా తాగించి ఆమెపై పశువుల్లా ప్రవర్తించారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా మాచర్లలో జరిగింది.

Girl malested in Guntur district of AP
Author
Macherla, First Published Jan 15, 2020, 9:04 AM IST

గుంటూరు: గుంటూరు జిల్లా మాచర్ల మండలం బీకేవీ చెంచుకాలనీలో జరిగిన సామూహిక అత్యాచారానికి సంబంధించి విస్తుపోయే విషయాలు తెలిశాయి. బంధువుల ఇంటికి వచ్చిన యువతిపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. 

బంధువుల ఇంటికి శుభకార్యానికి వచ్చిన యువతిని మాయమాటలు చెప్పి ముగ్గురు వ్యక్తులు నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు బలవంతంగా సారా తాగించి ఆమెపై ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. 

Also Read: గుంటూరు జిల్లాలో గ్యాంగ్ రేప్: చికిత్స పొందుతూ యువతి మృతి

దాంతో తీవ్ర ఆస్వస్థతకు గురైన యువతి 20 రోజుల తర్వాత సోమవారం రాత్రి మరణించింది. దాంతో విషయం వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలోని ఓ గోరామానికి చెందిన యువతి (21) కూలి పనులు చేసుకుంటూ తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. 

గత నెల 24వ తేదీన మాచర్ల మండలంలోని తమ బంధువుల ఇంటికి వచ్ిచంది. శుభకార్యం ముగిసిన తర్వాత తెలిసిన వ్యక్తులే మాయమాటలు చెప్పిన ఆమెను నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లారు. 

అక్కడ యువతికి బలవతంగా సారా తాగించి ముగ్గురు కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను బంధువుల ఇంటికి సమీపంలో వదిలి వెళ్లిపోయారు. ఆమెను బంధువులు తమ ఇంటికి తీసుకుని వెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత మాచర్లలోని ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. అయితే, గుంటూరు ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలని వైద్యులు సూచించారు.

ఆర్థిక స్తోమత లేకపోవడంతో అదే ఆస్పత్రిలో వైద్యులు చేసే చికిత్సతో సరిపుచ్చుకున్నారు. యువతి ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తూ వచ్చింది. కదలలేని స్థితిలో ఉన్న యువతి శరీరంపై గాయాలను చూసిన కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దాంతో 4 రోజుల క్రితం తమ బంధువులకు ఫోన్ చేశారు. 

నిందితుల బంధువులే జరిగిన విషయాన్ని గ్రామపెద్దలకు తెలియజేసినట్లు తెలిసింది. దాంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios