గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా మాచర్ల మండలం బీకేవీ చెంచుకాలనీలో యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. 

బంధువుల ఇంటికి వచ్చిన యువతిపై కామాంధులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి మరణించింది. గత నెల 24వ తేదీన జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.