విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఎదురు దెబ్బ తగలనుంది. ఉత్తరాంధ్రలో టీడీపీకి బలమైన నాయకుడిగా ఉంటూ ఉంటూ వస్తున్న గంటా శ్రీనివాస రావు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోది. ఇది ఊహించిందే అయినప్పటికీ టీడీపీ ఉత్తరాంధ్రలో తీవ్రమైన దెబ్బ తగులుతుందని చెప్పడంలో సందేహం లేదు. 

గత కొన్ని నెలలుగా ఉత్తర నియోజకవర్గ టీడీపి ఎమ్మెల్యే , మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు వైసిపిలో చేరుతారనే ఊహాగానాలు షికార్లు చేస్తున్నాయి. అవన్నీ వాస్తవ రూపానికి దగ్గరవుతున్నట్లుగా తెలుస్తోంది ఆగస్టు 9 వ తేదీన ఆయన వైసిపీలో చేరుతున్నట్లు ఆభిజ్ఞ వర్గాల సమాచారం. 

Also Read: గంటా శ్రీనివాస రావుకు పచ్చ జెండా ఊపిన జగన్: తెర వెనక రాయబారం ఈయనే

ఆగస్టు 9 ముహూర్తం పెట్టుకుని గంటా శ్రీనివాసరావు సీఎం  జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొనున్నారని తెలుస్తోంది. నిజానికి ఆగస్టు 15వ తేదీన ఇళ్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఆయన  జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ, అంతకన్నా ముందే ఆయన టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

గంటా శ్రీనివాస రావు వైసీపీలో చేరడానికి ముందు శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఆయనకు జగన్ కీలకమైన పదవి ఇవ్వనున్నట్లు, దాంతో ఆయన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు చెబుతున్నారు. 

Also Read: వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్: వైసీపీలోకి గంటా శ్రీనివాస రావు

ఉత్తరాంధ్ర ప్రాంతీయ బోర్డు చైర్మన్ పదవిని ఆయనకు అప్పగించనున్నట్లు చెబుతున్నారు. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు గానీ ఆ రకమైన ప్రచారం మాత్రం సాగుతోంది. రాష్ట్ర సమతుల అభివృద్ధికి ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.