Suryapet: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు తృటిలో పెనుప్ర‌మాదం త‌ప్పింది. ఆయ‌న‌ కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఆయ‌న‌కు పెద్ద‌గా గాయాలు కాలేద‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.  

Gannavaram MLA Vallabhaneni Vamsi Mohan: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు తృటిలో పెనుప్ర‌మాదం త‌ప్పింది. ఆయ‌న‌ కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఆయ‌న‌కు పెద్ద‌గా గాయాలు కాలేద‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. 

వివ‌రాల్లోకెళ్తే.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. అయితే ఎమ్మెల్యేకు పెద్దగా గాయాలు కాలేదు. శనివారం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కాసింపేట వద్ద కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

అయితే దురదృష్టవశాత్తు ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనం కూడా ప్రమాదానికి గురైంది. ప్రమాదం నుంచి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ పెద్దగా గాయపడకుండా బయటపడడం విశేషం. ఈ ప్ర‌మాదంలో ఒక వాహ‌నం పెద్ద‌గా దెబ్బ‌తిన‌డంతో దానిని అక్క‌డే వ‌దిలివేసి.. తన కాన్వాయ్‌లోని మిగిలిన వాహనాలతో హైదరాబాద్ వెళ్లిపోయారు.