Asianet News TeluguAsianet News Telugu

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో అర్థరాత్రి దొంగల బీభత్సం, ప్రయాణికులను బెదిరించి దోపిడి

మారణాయుధాలతో  ప్రవేశించిన 12 మంది దొంగలు...

Gang Robbery in Venkatadri Express

కాచీగూడ నుండి తిరుపతికి వెళుతున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. అర్థరాత్రి సమయంలో గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలోని రాయల్ చెరువు వద్ద రైలు ఆగేలా చేసి రైల్లోకి ప్రవేశించి దోపిడీకి పాల్పడ్డారు. మారణాయుధాలతో బెదిరించి ప్రయాణికుల నుండి బంగారు ఆభరణాలతో పాటు నగదు, విలువైన సామాగ్రి దోచుకెళ్లారు.

ఈ రైలు దోపిడీకి సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. తిరుపతి నుండి హైదరాబాద్ కు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌  ప్రయాణికులతో బయలుదేరింది.అయితే అర్థరాత్రి సమయంలో కొందరు దోపిడీ దొంగలు రైలు సిగ్నల్ కేబుల్స్ ను కట్ చేసి రాయల్ చెరువు వద్ద  రైలు ఆగేలా చేశారు. ఆగివున్న రైల్లోకి మాకణాయుధాలతో ప్రవేశించిన దొంగలు ప్రయాణికులను బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు.

ముందుగానే పోలీసులు లేని బోగీలను గుర్తించిన దొంగలు ఎస్‌-10, ఎస్‌-11, ఎస్‌-12 బోగీల్లోకి దాదాపు 12 మంది దొంగలు ప్రవేశించారు. అందులోని ప్రయాణికులను బెదిరించి 15 తులాల బంగారు ఆభరణాలు, రూ. 10వేల నగదును ఎత్తుకెళ్లారు. కొందరు ప్రయాణికలు దొంగల్ని ఎదిరించే ప్రయత్నం చేయగా వారిని చితకబాదారు.దీంతో వారికి గాయాలయ్యాయి. క్షణాల్లోనే తమ పని కానిచ్చిన దొంగలు అక్కడి నుండి పరారయ్యారు.

ఈ దోపిడీకి గురైన బాధితులు గుత్తి రైల్వే స్టేషన్ కు చేరుకున్నాక పోలీసులకు జరిగిన దోపిడి గురించి తెలిపి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.   

Follow Us:
Download App:
  • android
  • ios