Asianet News TeluguAsianet News Telugu

పెద్దాపురం జీ.రాగంపేటలో విషాదం: ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేస్తూ ఏడుగురు కార్మికులు మృతి

కాకినాడ  పెద్దాపురం  మండలం  జీరాగంపేటలో  ఆయిల్ ఫ్యాక్టరీలో  జరిగిన ప్రమాదంలో  ఏడుగురు  కార్మికులు మృతి చెందారు.

seven  killed in accident at oil  Factory  in Kakinada district
Author
First Published Feb 9, 2023, 10:14 AM IST

కాకినాడ: జిల్లాలోని పెద్దాపురం  మండలం జీ.రాగంపేటలో  గల ఆయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది.   ఈ ఘటనలో  ఏడుగురు కార్మికులు  మృతి చెందారు.  కొత్తగా నిర్మిస్తున్న ఆయిల్ ఫ్యాక్టరీలో   ట్యాంకర్ శుభ్రం చేసేందుకు వెళ్లిన కార్మికులు  మృతి చెందారు . ఘటనస్థలంలోనే ఏడుగురు మృతి చెందారు. 

మృతుల్లో  ఇద్దరు పెద్దాపురం మండలం పులిమేరకు చెందినవారుగా  గుర్తించారు. మిగిలిన ఐదుగురు  పాడేరుకు చెందినవారుగా  పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆయిల్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు ట్యాంకర్ లోకి దిగిన  కార్మికులు  ఊపిరాడక మృతి చెందారు. 

  ఆయిల్  ట్యాంకర్  ను శుభ్రం  చేసేందుకు  ఒక కార్మికుడు తొలుత  ట్యాంకర్ లోకి దిగాడు. ఆ తర్వాత  అతని కోసం  మరో ఇద్దరు  ట్యాంకర్ లోకి దిగారని  స్థానికులు  చెబుతున్నారు.  విడతలుగా  ఆయిల్ ట్యాంకర్  లోకి వెళ్లినవారంతా మృతి చెందారు.  ఇవాళ  ఉదయం ఆరు గంటలకే విధులకు  వచ్చిన  కార్మికులు  ఈ ప్రమాదానికి గురయ్యారు.   ఆయిల్  లోడింగ్, అన్ లోడింగ్  చేసిన  తర్వాత ట్యాంకర్  ను శుభ్రం  చేస్తారు.  ఆయిల్ ట్యాంకర్  ను బద్దలు కొట్టి మృతదేహలను వెలికి తీశారు.

ఉదయం పూట షిప్ట్ లో  70 నుండి 100 మంది  విధులు నిర్వహిస్తారు. ఈ ఫ్యాక్టరీలో   ఏ విభాగంలో  ఎవరు పనిచేయాలనే దానిపై  కార్మికులకు విధులు  కేటాయించారు.  ట్యాంకర్  శుభ్రం  చేసే విధులు  చేయాల్సిన  కార్మికులు  ట్యాంకర్  లోకి దిగి మృతి చెందారు.  ఈ ప్రమాదం  విషయం తెలిసిన వెంటనే  పోలీసులు సంఘటనస్థలానికి  చేరుకుని దర్యాప్తు  చేస్తున్నారు.  మృతుల కుటుంబాలకు  సమాచారం  ఇచ్చారు. వెచ్చంగి కృష్ణ,  వెచ్చంగి నర్సింహ, వెచ్చంగి సాగర్, బొంజుబాబు,రామారావు , జగదీష్, ప్రసాద్ లు ఈ ప్రమాదంలో  మృతి చెందినట్టుగా  గుర్తించారు.

Follow Us:
Download App:
  • android
  • ios