పవన్ వద్ద డబ్బులు లేవని, సామాజికవర్గంలోని ప్రముఖులు తలా ఓ చేయి వేయాల్సిన అవసరముందని చెబుతూ వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రచారం జరుగుతోంది.

సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేరు చెప్పి డబ్బుల వసూళ్ళకు పాల్పడుతున్నారా? తన వద్ద డబ్బులు లేవని ఈ మధ్య పవన్ తరచూ చెబుతున్నారు. అమెరికా పర్యటనలో కూడా పవన్ ఇదే విషయాన్నిచెప్పారు. పవన్ మాటలను అవకాశంగా తీసుకుని కొందరు భారీగా డబ్బుల వసూళ్ళకు దిగినట్లు సమాచారం. అమెరికా పర్యటనలో పవన్ చెప్పిన మాటలను అవకాశంగా తీసుకున్నట్లే కనబడుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

మెగా కుటుంబానికి బాగా తెలిసినవాళ్ళే పవన్ పేరు చెప్పి డబ్బులు అడుగుతున్నట్లు తెలుస్తోంది. పవన్ వద్ద డబ్బులు లేవని, సామాజికవర్గంలోని ప్రముఖులు తలా ఓ చేయి వేయాల్సిన అవసరముందని చెబుతూ వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకు గాను కొందరిని లక్ష్యంగా చేసుకుని ‘ఇంత మొత్తం’ ఇవ్వాలంటూ అడుగుతున్నారట. అడుగుతున్నారు కాబట్టి అదీ పవన్ పేరు చెబుతున్నారు కాబట్టి పవన్ పై ఉన్న అభిమానంతో ఇచ్చే వారు ఎంతో కొంత ఇస్తున్నారట. మరి ఈ విషయం పవన్ కు తెలుసో లేదో?