అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. తాజాగా సోమవారం ఐదు అనుమానిత కేసులు బయటపడ్డాయి. మూడు జిల్లాల్లో ఐదు కేసులు బయపడ్డాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు అనుమానిత కేసులు బయటపడ్డాయి. వారు ఇటీవలే విదేశాల నుంచి వచ్చారు. వారిని ఆస్పత్రికి తరలించారు. 

కడప జిల్లాలో ఓ కరోనా వైరస్ అనుమానిత కేసు బయటపడింది. కరోనా సోకినట్లు అనుమానిస్తున్న వ్యక్తి బెంగళూరు నుంచి కడపకు వచ్చాడు. అతన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరో కేసు చిత్తూరు జిల్లాలో బయటపడింది. అమెరికా నుంచి ఆ యువకుడి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అతన్ని రుయా ఆస్పత్రికి తరలించారు. 

Also Read: కరోనా దెబ్బ: పిఠాపురంలో పెళ్లిని నిలిపివేసిన అధికారులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 188 మంది నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపించారు. యుకే, మస్కట్, దుబాయ్ ల నుంచి వచ్చినవారికి వైరస్ లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చినవారు తప్పకుండా క్వారంటైన్ కు రావాలని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. జనతా కర్ఫ్యూకు సహకరించినవారికి ధన్యవాదాలు చెప్పారు. 

బెజవాడ వాసులకు లాక్ డౌన్ ను పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతున్నారు. చాలా ప్రాంతాల్లో కార్యాలయాలు తెరిచి ఉంచారు. నగరంలో 144వ సెక్షన్ విధించారు. ఇప్పటికే విజయవాడలో ఓ పాజిటివ్ కేసు నమోదైంది. ప్రజలను కట్టడి చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. 

Also Read: మహిళకు కరోనా పాజిటివ్: ఏపీలో 7కు చేరిన కరోనా కేసులు