టీడీపీ నేత కొల్లు రవీంద్ర ని ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా... ఆయన అరెస్టు పై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. మిస్లర్ క్లీన్ కొల్లు రవీంద్రను అరెస్టు చేసి.. జగన్ రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు.

‘‘రాజకీయాల్లో మిస్టర్ క్లీన్ గా ఉన్న కొల్లు రవీంద్ర లాంటి నాయకుడిని అరెస్ట్ చేసి జగన్ రెడ్డి గారు తన మూర్ఖత్వాన్ని,రాక్షస మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారు. బీసీలకు చేస్తున్న అన్యాయం బయటపడుతుంది అనే భయం జగన్ రెడ్డి గారిని వెంటాడుతోంది.అందుకే బలమైన బీసి నాయకులను తప్పుడు కేసుల్లో ఇరికించి వేధిస్తున్నారు.’’

 

‘‘అసమర్థ పాలనలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఎండగడుతూ కొల్లు రవీంద్ర పోరాడుతున్నారు.కక్ష సాధింపులో భాగంగా జరిగిన కొల్లు రవీంద్ర గారి అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజల్ని గాలికొదిలేసి,అధికారాన్ని కేవలం తన కక్ష సాధింపు కోసం వినియోగించుకుంటున్నారు.ఎన్ని సార్లు చివాట్లు తిన్నా జగన్ రెడ్డి గారి బుద్ధి మారడం లేదు.’’అంటూ లోకేష్ మండిపడ్డారు.