తిరుపతి: తిరుపతిలోని అలిపిరి చెక్ పోస్టు వద్ద కరోనా సెంటర్ లో పనిచేస్తున్న డాక్టర్, ల్యాబ్ టెక్నీషీయన్ కు కరోనా సోకింది. దీంతో తాత్కాలికంగా ఈ కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేశారు.దేశ, విదేశాల నుండి తిరుమలకు వచ్చే భక్తులకు అలిపిరి చెక్ పోస్టు వద్దే కరోనా టెస్టులు నిర్వహిస్తారు. అయితే ఈ కేంద్రం మూసివేయడంతో ఎక్కడ టెస్టులు నిర్వహిస్తారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ప్రతి రోజూ విధులకు హాజరయ్యే టీటీడీ ఉద్యోగులకు కూడ ఇదే కేంద్రంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. అలిపిరి వద్ద ఏర్పాటు చేసిన కరోనా పరీక్షా కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్, ల్యాబ్ టెక్నీషీయన్ కు కరోనా సోకిందని వైద్యులు నిర్ధారించారు.

also read:91 మంది టీటీడీ స్టాఫ్‌కు కరోనా: ఈవో సింఘాల్

రెండు రోజుల క్రితం ఈ కేంద్రంలో పనిచేసే డాక్టర్, టెక్నీషీయన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో పరీక్షలు నిర్వహిస్తే కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఈ టెస్టింగ్ కేంద్రాన్ని బుధవారం నాడు మూసివేశారు.

మరో వైపు తిరుపతిలో ఇప్పటికే వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకు కరోనా కేసులు పెరగడంపై స్థానికుల్లో ఆందోళన నెలకొంది.తిరుమలలో కూడ పలువురికి కరోనా సోకింది.

తిరుమల ఆలయంలో పనిచేసే నలుగురు అర్చకులకు కూడ కరోనా సోకింది.తిరుమలలోని బాలాజీ నగర్ లో ముగ్గురికి కరోనా సోకింది. దీంతో ఏం చేయాలనే దానిపై అధికారులు తర్జన భర్జనలు పడుతున్నారు.