Asianet News TeluguAsianet News Telugu

91 మంది టీటీడీ స్టాఫ్‌కు కరోనా: ఈవో సింఘాల్

ఈ ఏడాది జూన్ 11వ తేదీ నుండి జూలై 11 వ తేదీ వరకు  2,50,176 మంది భక్తులు దర్శనం చేసుకొన్నారని టీటీడీ ఈవో ఆశోక్ సింఘాల్ చెప్పారు. 
 టీటీడీ ఉద్యోగులు, సెక్యూరిటీ , పోలీసు సిబ్బందిలో 91 మందికి కరోనా వచ్చిందని ఆయన తెలిపారు.

91 ttd staff tested corona positive says TTD
Author
Tirupati, First Published Jul 12, 2020, 1:53 PM IST


తిరుమల: ఈ ఏడాది జూన్ 11వ తేదీ నుండి జూలై 11 వ తేదీ వరకు  2,50,176 మంది భక్తులు దర్శనం చేసుకొన్నారని టీటీడీ ఈవో ఆశోక్ సింఘాల్ చెప్పారు. 
 టీటీడీ ఉద్యోగులు, సెక్యూరిటీ , పోలీసు సిబ్బందిలో 91 మందికి కరోనా వచ్చిందని ఆయన తెలిపారు.

ఆదివారం నాడు డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి రోజూ సగటున పదివేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొన్నారని చెప్పారు. కళ్యాణ కట్టలో ఇంతవరకు ఎవరికీ  కూడ కరోనా సోకలేదన్నారు. ఇప్పటివరకు 82,520 మంది తలానీలలు సమర్పించారని ఆయన తెలిపారు. 

ఆన్‌లైన్ లో  టిక్కెట్లు పొందిన 1,64,742 మంది భక్తులు, కరెంట్ బుకింగ్ ద్వారా 85,434 మంది శ్రీవారిని దర్శించుకొన్నారని ఆయన చెప్పారు. ఈ నెలలో 2,50, 176 మంది భక్తులు తిరుమలేశుడిని దర్శించుకొన్నట్టుగా ఆయన తెలిపారు.

also read:తిరుమలకు తగ్గిన ఆదాయం, భక్తులు: నెల రోజుల్లో రెండున్నర లక్షల మంది దర్శనం

ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకొని కూడ 55,669 మంది మంది దర్శనానికి రాలేదని ఈవో చెప్పారు. కరెంట్ బుకింగ్ ద్వారా 90,716 మంది టిక్కెట్లను బుక్ చేసుకొన్నారు. కానీ 11 వేల మంది దర్శనానికి రాలేదని ఆయన వివరించారు.

నెలరోజుల్లో రూ. 16.73 కోట్లు హుండీ ద్వారా ఆదాయం వచ్చిందన్నారు. భక్తులు 100 గ్రాముల బంగారు బిస్కట్లు 20 సమర్పించినట్టుగా ఈవో చెప్పారు. నెల రోజులుగా 13.36 లక్షల మంది భక్తులకు లడ్డులను అందించినట్టుగా ఆయన తెలిపారు. 

శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు టెండర్లు పిలిచినట్టుగా ఆయన చెప్పారు. అయితే అప్పటి పరిస్థితులను బట్టి బ్రహ్మోత్సవాలు నిర్వహించే విషయమై నిర్ణయం తీసుకొంటామన్నారు.ఈ ఏడాది సెప్టెంబర్ వరకు టీటీడీకి ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేవని ఈవో స్పష్టం చేశారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios