కేవలం గేదె కోసం ఇంత రక్తపాతమా..! మద్యం బాటిల్స్ తో నలుగురి తలలు పగలగొట్టి...
పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పక్కపక్క ఇళ్లలో వుండే కుటుంబాల మధ్య జరిగిన గొడవ రక్తపాతం సృష్టించింది.

పల్నాడు : కేవలం గేదె విషయంలో ఇరుగుపొరుగు ఇళ్లవారి మధ్య జరిగిన గొడవ ఓ కుటుంబం మొత్తాన్ని ప్రాణాపాయస్థితిలోకి నెట్టింది. ఈ దారుణం పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. పక్కింటివారు రాళ్ళు, మద్యం సీసాలతో దాడికి పాల్పడటంలో నలుగురు కుటుంబసభ్యులు తలలు పగిలి రక్తపాతం జరిగింది. గాయాలపాలైన కుటుంబం మొత్తం ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతోంది.
వివరాల్లోకి వెళితే... పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కొత్తపల్లి గ్రామంలో గత రాత్రి పక్కపక్క ఇళ్లలో వుండే రెండు కుటుంబాలు గొడవపడ్డాయి. గేదె విషయంలో చిన్నగా మొదలైన వాగ్వాదం కాస్త భౌతిక దాడులు చేసుకునే స్థాయికి చేరుకుంది. చివరకు ఓ కుటుంబంపై మరో కుటుంబం రాళ్లు, మద్యం సీసాలతో దాడికి పాల్పడి రక్తపాతం సృష్టించారు.
తమ ఇంటిపైనుండి పక్కింటివారిపై మద్యం బాటిల్లు విసిరారు. దీంతో ఆ ఇంట్లోని వారి తలలు పగిలి తీవ్రంగా గాయపడ్డారు. ఒళ్లంతా రక్తంలో తడిసిన స్థితిలో బాధిత కుటుంబం హాస్పిటల్ కు చేరుకుని చికిత్స పొందుతోంది.
Read More గొంతు కోసి బాలుడి హత్య.. మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.