విశాఖ ఆరిపాకలో బాణసంచా పేలుడు: నలుగురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు

ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలోని సబ్బవరం అరిపాకలోని ఓ ఇంట్లో బాణసంచా పేలింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 
 

Four  injured after crockery blast in visakhapatnam

విశాఖపట్టణం: ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలోని సబ్బవరం  మండలం ఆరిపాకలోని ఓ ఇంట్లో బాణాసంచా పేలినలుగరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి అనుమతి లేకుండానే రహస్యంగా ఈ ప్రాంతంలో బాణసంచా తయారు చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.  ఈ ఘటనలో గాయపడిన నలుగురిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని స్థానిక ఎస్ఐ సురేష్, అగ్నిమాపక సిబ్బంది పరిశీలించారు. 

 కంచ ర పాలెం  చెందిన ఇద్దరు వ్యక్తుతో పాటు మరో ఇద్దరు  కూడా బాణసంచా తయారు చేస్తున్నారని గుర్తించారు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం నాడు ఉదయం వంట చేస్తున్న సమయంలో  బాణాసంచా తయారీ కేంద్రంలో మంటలు వ్యాపించినట్టుగా పోలీసులు చెబుతున్నారు.ఈ ఘటనలో  శంకర్రావు ( 48), కమలమ్మ ( 38), మహేష్,  ప్రసాద్ లు గాయపడ్డారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మహేష్, కమలమ్మ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. దీపావళి కోసం అరిపాకలో అనుమతి లేకుండా బాణసంచా తయారు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని ఆనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు.

గతంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు చోట్ల బాణసంచా తయారీ కేంద్రాలు, గోడౌన్లలో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.ఈ ఏడాది ఫిబ్రవరి 4న తూర్పుగోదావరి జిల్లా  మండపేటలో జరిగిన పేలుడులో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios