జగ్గయ్యపేట: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు వద్ద ఆదివారం నాడు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

read more  హైదరాబాద్‌లో దారుణం...పురిటిబిడ్డ బ్రతికుండగానే పూడ్చిపెట్టే ప్రయత్నం

అతి వేగంగా వస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుకు అవతలి వైపు నుండి వస్తున్న మరో కారును ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.ప్రమాద స్థలిలోనే ఇద్దరు మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 read more  భవన నిర్మాణ కార్మికుడి భార్య అనుమానాస్పద మృతి

హైద్రాబాద్ నుండి కారులో విజయవాడ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. మృతులంతా ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు.