ఏదో ఓ కార్కక్రమం పెట్టుకోవటం శంకుస్ధాపన పేరుతో పెద్ద ఈవెంట్ ను నిర్వహించటం సిఎంకు అలవాటుగా మారిపోయింది.
చంద్రబాబునాయడు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఇప్పటి వరకూ శంకుస్ధాపనల మీద శంకుస్ధాపనలు జరుగుతున్నాయి. గడచిన రెండున్నరేళ్లల్లో చంద్రబాబు వివిధ పనులకు కొన్ని వందల శంకుస్ధాపనలు జరిపించి ఉంటారు. తాజాగా మరో శంకుసస్ధాపన కార్యక్రమానికి సిఎం రంగం సిద్ధం చేస్తున్నారు.
ఈనెల 19వ తేదీన పోలవరం కాంక్రీట్ పనులకు శంకుస్ధాపన చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని ముఖ్యఅతిధిగా ఆహ్వానిస్తున్నారు. మంత్రితో పాటు పలువురు ప్రముఖులను కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు.
ఏదో ఓ కార్కక్రమం పెట్టుకోవటం శంకుస్ధాపన పేరుతో పెద్ద ఈవెంట్ ను నిర్వహించటం సిఎంకు అలవాటుగా మారిపోయింది. అందుకోసం ఎన్ని కోట్లు ఖర్చవుతున్నా వెనకాడటం లేదు. ఓ వైపు ప్రభుత్వం వద్ద నిధులు లేవని చెబుతూనే ఈవెంట్ల నిర్వహణ పేరుతో కోట్లాది రూపాయలు వ్యయం చేస్తుండటం గమనార్హం.
గడచిన రెండున్నరేళ్ళల్లో రాజధాని నిర్మాణం పేరుతో రెండు శంకుస్ధాపనలు జరిగాయి. మొదటిసారి ముఖ్యమంత్రులు దంపతులే చేసారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడితో మళ్ళీ చేయించారు. రెండు సార్లూ కొన్ని వందల కోట్ల రూపాయలు వ్యయం అయ్యాయి. ఆ తర్వాత రాజధానిలోనే నిర్మించాలనుకున్న కొన్ని భవనాలకు కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లతో శంకుస్ధాపనలు చేయించారు.
అలాగే, పోలవరం నిర్మాణం చాలా సంవత్సరాల క్రితమే మొదలైనా ఇప్పటికి కనీసం మూడు శంకుస్ధాపనలు జరిగాయి. ఇపుడు తాజాగా మరో శంకుస్ధాపన కార్యక్రమం పెట్టుకున్నారు. ఓ పథకం ప్రారంభించేటపుడు శంకుస్ధాపన జరగటం సహజమే. అయితే, పథకంలోని అనేక పనులకు విడివిడిగా మళ్ళీ, మళ్ళీ శంకుస్ధాపలను చేయటమన్నది చంద్రబాబుతోనే మొదలైంది.
