గురువారం రాజకీయంగా ఓ పరిణామం జరిగింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ అరగంటపాటు భేటీ అయ్యారు.
గురువారం రాజకీయంగా ఓ పరిణామం జరిగింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ నివాసానికి లగడపాటి సాయంత్రం పొద్దుపోయిన తర్వాత హటాత్తుగా ప్రత్యక్షమయ్యారు. దాంతో అక్కడే ఉన్న వైసీపీ నేతలు ముందు ఆశ్చర్యపోయారు. ఇంతలో లగడపాటి జగన్ ఇంట్లోకి వెళ్ళిపోయారు.
6వ తేదీ నుండి జగన్ పాదయాత్ర మొదలవుతున్న సందర్భంగా లగడపాటి వచ్చి కలవటంతో ఊహాగానాలు మొదలయ్యాయి. ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో లగడపాటి వైసీపీ తరపున విజయవాడ ఎంపిగా పోటీ చేస్తారంటూ ఆమధ్య ప్రచారం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. తర్వాత అనేక ప్రచారాలు కూడా జరిగాయనుకోండి అది వేరే సంగతి. లగడపాటి అయితే, ఏ విషయాన్ని ఇంత వరకూ ఎక్కడా ప్రకటించలేదు.
అదే సందర్భంలో అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబునాయుడుకు కూడా కలుస్తూనే ఉన్నారు. దాంతో లగడపాటిపై నిత్యం ఊహాగానాలు ప్రచారంలోనే ఉంటున్నాయి. ఈమధ్య కాలంలో లగడపాటైతే జగన్ ను కలవలేదు. ముందస్తు ఎన్నకల ప్రచారం సందర్భంగా అందులోనూ పాదయాత్ర తేదీ దగ్గర పడుతున్న నేపధ్యంలో వీరిద్దరి భేటీ సర్వత్రా ఆసక్తి నెలకొంది.
