చేతబడి నెపంతో మాజీ ఎంపీని హత్య చేసిన మనవడు

Former MP killed by his grandson in Guntur district
Highlights

తాతను చంపి తండ్రికి ఫోన్ చేసిన మనవడు

నర్సరావుపేట:  చేతబడి  చేస్తున్నాడనే నెపంతో  తాతను  గొంతుకోసి మనుమడు దారుణంగా హత్య చేసిన ఘటన  గుంటూరు జిల్లా నరసరావుపేటలో  ఆదివారం నాడు చోటు చేసుకొంది. మృతుడు 1996లో నర్సరావుపేట నుండి ఎంపీగా విజయం సాధించాడు. 


గుంటూరు జిల్లా  మాచర్ల మండలంలోని 7వ, మైలు చెంచు కాలనీలో  కోట సైదయ్యను  అతని మనుమడే హత్య చేశాడు.అంజి కొంతకాలంగా అనారోగ్యంతో ఉంటున్నాడు. తాత చేతబడి చేసినందునే  తాను అనారోగ్యానికి గురయ్యాయని అంజి అనుమానపడ్డాడు. దీంతో  తాత సైదయ్యను హత్య చేయాలని ప్లాన్ చేశాడు.

ఈ ప్లాన్ ప్రకారంగా  ఆదివారం నాడు ఉదయమే సైదయ్య ఇంటికి వచ్చిన  అంజి తాతను హత్య చేశాడు.  గొంతుకోసి చంపేశాడు. తాత మరణించిన తర్వాత ఈ విషయాన్ని తన తండ్రికి ఫోన్  చేసి చెప్పాడు.  ఆ తర్వాత అతను పారిపోయాడు. సైదయ్య 1996లో నర్సరావుపేట ఎంపీ స్థానం నుండి  టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కాసు వెంకట కృష్ణారెడ్డిపై 18,958 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

loader