Asianet News TeluguAsianet News Telugu

టిడిపిలో లొల్లి: సీఎం రమేష్‌పై మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి సంచలనం

కడప టిడిపిలో గ్రూపుల గొడవలు

Former MLA Varadarajulu Reddy slams on MP CM Ramesh

ప్రొద్దుటూరు: ఎంపీ సీఎం రమేష్  పార్టీలో గ్రూపు రాజకీయాలను నడుపుతూ పార్టీకి నష్టం చేస్తున్నారని  మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే సీట్లను కూడ  ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. 

ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని పార్టీ కోసం పనిచేసే వ్యక్తిని బరిలోకి దింపితే గెలిపించుకొంటామని వరదరాజులురెడ్డి చెప్పారు.  స్థానిక మున్సిఫల్ చైర్మెన్ ఆనం రఘురామిరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో గ్రూపు రాజకీయాలకు పాల్పడుతూ  పార్టీకి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్  పార్టీకినష్టం చేస్తున్నారని  ఆయన ఆరోపించారు. 

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి సత్తా లేని సీఎం రమేష్ గ్రూపు రాజకీయాలకు పాల్పడుతూ  తన పబ్బం గడుపుకొంటున్నారని ఆయన ఆరోపించారు. పార్టీ కోసం చంద్రబాబునాయుడు ఎంపీని చేస్తే పార్టీని నాశనం చేసేందుకు సీఎం రమేష్ ప్రయత్నిస్తున్నాడని వరదరాజులు చెడ్డి ఆరోపించారు. 

ప్రొద్దుటూరు మున్సిఫల్ పార్కులో నీటి ట్యాంకు వద్దని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి వ్యతిరేకిస్తోంటే టిడిపి కౌన్సిలర్లతో కలిసి ఎమ్మెల్యేకు సహకరిస్తావా అంటూ ఆయన ప్రశ్నించారు. 

ఇన్‌ఛార్జి మంత్రి, జిల్లా అధ్యక్షుడు, కౌన్సిలర్లు చెప్పినా వినకుండా అంత ధైర్యంగా వాళ్లు తీర్మానం చేశారంటే అందుకు పూర్తి బాధ్యత ఎంపీదేనన్నారు. దీన్ని పార్టీ తీ వ్రంగా పరిగణించి ఎంపీ రమేష్‌పై చర్యలు తీసుకోవా లన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios