భీమవరం రాళ్లదాడి : టీడీపీ మాజీ ఎమ్మెల్యే వెంకట శివరామరాజుకు విరిగిన పక్కటెముక
వైసీపీ రాళ్లదాడిలో మాజీ ఎమ్మెల్యే వెంకట శివరామరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. పక్కటెముకలు విరిగాయి.

పశ్చిమగోదావరి జిల్లా : మంగళవారం ఆంధ్రప్రదేశ్లో టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రపై రాళ్లదాడి జరిగింది. మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు అలియాస్ కలువపూడి శివ ఈ రాళ్లదాడులో తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను బుధవారం మధ్యాహ్నం హైదరాబాదుకు చికిత్స నిమిత్తం తరలించిన సంగతి తెలిసిందే.
ఈ రాళ్లదాడిలో కలువ పూడి శివ పక్కటెముకలు విరిగినట్లుగా టిడిపి నాయకులు చెబుతున్నారు. వైసీపీ మూకలు విసిరిన రాళ్లు ఆయన ఛాతి భాగంలో తగిలాయని తెలిపారు. రాళ్లదాడి అనంతరం మంగళవారం రాత్రి వెంకట శివరామరాజును భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సలో భాగంగా వైద్యులు 2డి ఎకో టెస్ట్ చేశారు.
భీమవరంలో దాడులకు ఉసిగొల్పింది లోకేషే... కేసులు పెట్టండి..: పోలీసులకు మంత్రి సూచన
గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గుల సమస్యలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలియడంతో బుధవారం తెల్లవారుజాము నుంచి టిడిపి నాయకులు ఆయనను పరామర్శించడం మొదలుపెట్టారు. ఆయనను ప్రత్యేక వాహనంలో లోకేష్ పాదయాత్ర చేస్తున్న ప్రాంతానికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం బుధవారం సాయంత్రం వెంకట శివరామరాజును హైదరాబాదుకు తరలించినట్లు టిడిపి నాయకులు సమాచారం ఇచ్చారు.