అనంతపురం: తనపై ఎలాంటి వాహనాలు లేవని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అయినా కూడ తనపై ఎలా కేసులు పెడతారని ఆయన ప్రశ్నించారు.

బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో శాంతిభద్రతలు లేకుండా పోయాయని ఆయన ఆరోపించారు. తప్పేమీ చేయకపోయినా కూడ తనపై కేసులు పెట్టి  జైల్లో వేస్తున్నారని ఆయన ఆరోపించారు.

also read:జేసి ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో మరో మలుపు... కర్ణాటకతో లింక్

స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాల్లో  పన్ను మినహాయింపు ఉంటుంది. దీంతో నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల నుండి వాహనాలను కొనుగోలు చేస్తుంటారని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ చట్టాలు అందరికీ ఒకేలా ఉంటాయని ఆయన తెలిపారు.

బీఎస్-3 వాహనాలను బీఎస్-4 గా మార్చి విక్రయించారని  మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు జేసీ ఆస్మిత్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో కడప జైలు నుండి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తనయుడు ఆస్మిత్ రెడ్డిలు బయటకు వచ్చారు.మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై తాజాగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు చేశాడు.