అనంతపురం: మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన దివాకర్ ట్రావెల్స్ సంస్థపై నమోదయిన ఫోర్జరీ కేసు మరో మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు కూడా అరెస్టయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పోర్జరీ వ్యవహారంతో కర్ణాటకకు చెందిన రవాణా శాఖ ఉన్నతాధికారుల ప్రమేయం కూడా వుందంటూ వైసిపి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. 

ఈ మేరకు  కర్ణాటక లోకాయుక్తతో పాటు డిజిపి, పలువురు మంత్రులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఇప్పటికే అరెస్టయిన  ప్రభాకర్ రెడ్డి ప్రధాన అనుచరుడు గోపాల్ రెడ్డి కూడా ఈ ఫోర్జరీ వ్యవహారంతో సంబంధాలున్నాయంటూ లోకాయుక్తకు ఆధారాలను సమర్పించారు. 

read more  ట్రావెల్స్ డాక్యుమెంంట్స్ ఫోర్జరీ కేసు: జేసీకి మరో షాక్

నకిలీ పత్రాలు సమర్పించి బిఎస్ -3 వాహనాలను బీఎస్ -4గా మార్చి రిజిస్ట్రేషన్ చేయించారంటూ జెసి ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇలా కొనుగోలు చేసిన 33 బస్సులు, లారీలను దివాకర్ సంస్థ కర్ణాటకలో నడుపుతోంది. రవాణా శాఖ అధికారుల సహకారంతో ఈ వాహనాలు కర్ణాటకలో తిరుగుతున్నట్లు కేతిరెడ్డి ఆరోపించారు.