మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ ఆదివారం నాడు కన్నుమూశారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.కరోనా నుండి కోలుకొన్న తర్వాత శ్రీనివాస్  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. 

వీఎంఆర్డీఏ తొలి ఛైర్మెన్ గా ద్రోణంరాజు శ్రీనివాస్ పనిచేశారు.నెల రోజుల క్రితం ఆయనకు కరోనా సోకింది. దీంతో ఆయన కరోనాకు చికిత్స తీసుకొన్నారు.  కరోనా నుండి కోలుకొన్నారు.

2014, 2019 ఎన్నికల్లో  ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.2014లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా, 2019లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యాడు. 2019 మార్చి మాసంలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరారు.

ద్రోణంరాజు శ్రీనివాస్ 1961, ఫిబ్రవరి 1వ తేదీన  జన్మించారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ కొడుకే ద్రోణంరాజు శ్రీనివాస్.1980-81లలో బుల్లయ్య కాలేజీలో ఆయన చదివాడు. కాలేజీలో చదివే రోజుల్లోనే రాజకీయాలపై ఆసక్తిని కనబర్చారు. ఈ కాలేజీలో ఎన్ఎస్ యూఐ నేతగా ఆయన పనిచేశాడు.

1984-85 లలో యూత్ కాంగ్రెస్ లీడర్ గా పనిచేశాడు. 1987-89 లలో జిల్లా యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేశాడు.  1991 నుండి 1997 వరకు  కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2001 నుండి 2006 వరకు విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని నిర్వహించారు.  తండ్రి మరణించడంతో 2006లో ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009లో ఆయన రెండోసారి ఆయన విశాఖ దక్షిణ స్థానం నుండి గెలుపొందారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2012 ఫిబ్రవరి 9వ తేదీన ద్రోణంరాజు శ్రీనివాస్ ప్రభుత్వ విప్ గా నియమితులయ్యారు.