ఆనందయ్య అనుమతి లేకుండానే వెబ్‌సైట్: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఆనందయ్య అనుమతి లేకుండా వెబ్ సైట్ ఏర్పాటు చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
సోమవారం నాడు ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు.
నెల్లూరు: ఆనందయ్య అనుమతి లేకుండా వెబ్ సైట్ ఏర్పాటు చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.సోమవారం నాడు ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు.ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు. ఆనందయ్య మందును క్యాష్ చేసుకోవాలని కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరోసారి ఆయన విమర్శలు గుప్పించారు. ఆనందయ్య మందు విషయంలో తాను చెప్పిందే నిజమన్నారు.ఆనందయ్య మందు పంపిణీని అడ్డుకొంది వైసీపీనే ఆయన చెప్పారు.
also read:నేను, నా కుటుంబం సర్వనాశనం: ఆనందయ్య మందుపై విపక్షాలకు కాకాని కౌంటర్
తమ పోరాటం వల్లే ఆనందయ్య మందు పంపిణీకి అనుమతి లభించిందన్నారు.వైసీపీ కారణంగానే ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయిందని ఆయన చెప్పారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించకపోతే ఈ మందు విషయంలో మరో ఐదు మాసాల సమయం పట్టేదని ఆయన చెప్పారు. తాను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తనపై వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ రకమైన వ్యాఖ్యలు చేసినందుకు తెలుగు ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డిని డిమాండ్ చేశారు.