హైదరాబాద్: మాజీ మంత్రి సి. రామచంద్రయ్య  వైసీపీలో చేరనున్నారు.  ఈ నెల 13వ తేదీన పార్వతిపురంలో రామచంద్రయ్య వైసీపీలో చేరుతారు.

టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకోవడంతో వారం రోజుల క్రితమే సి. రామచంద్రయ్య    కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.  రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపారు.

మూడు రోజులుగా వైసీపీ నేతలతో  సి. రామచంద్రయ్య చర్చిస్తున్నారు. ఈ నెల 13వ తేదీన విజయనగరం జిల్లా పార్వతిపురంలో  వైఎస్ జగన్ సమక్షంలో సి. రామచంద్రయ్య వైసీపీలో చేరనున్నారు.

సి. రామచంద్రయ్య తొలుత టీడీపీలో ఉండేవారు.పీఆర్పీ  ఏర్పాటు తర్వాత టీడీపీని వీడి  ఆయన  పీఆర్పీలో చేరారు. పీఆర్పీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.

దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో  కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఇటీవలనే  కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌ను కలిశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సి. రామచంద్రయ్య  రాజీనామా చేశారు. వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.

ప్రస్తుతం బెంగుళూరులో ఉన్న  రామచంద్రయ్య  ఈ నెల 12వ తేదీన విజయనగరం జిల్లా పార్వతిపురానికి చేరుకోనున్నారు. బొబ్బిలిలో వైఎస్ జగన్ సమక్షంలో ఈ నెల 13న రామచంద్రయ్య వైసీపీలో చేరుతారు.

కడప జిల్లాకు చెందిన రామచంద్రయ్య వైసీపీలో చేరడం రాజకీయంగా తమకు కలిసి వస్తోందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే  రామచంద్రయ్య సోదరుడు ఇంకా టీడీపీలోనే కొనసాగుతున్నారు.   కర్ణాటకకు చెందిన  మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి  అక్రమ మైనింగ్  విషయంలో  ఆయన పోరాటం చేశారు.
 

సంబంధిత వార్తలు

చంద్రబాబుతో దోస్తీపై గుర్రు: కాంగ్రెసుకు చిరంజీవి రాంరాం

చంద్రబాబు పాపాలను మోయలేం, అందుకే కాంగ్రెస్ ను వీడుతున్నా:సి.ఆర్

బాబుతో రాహుల్ దోస్తీ ఎఫెక్ట్: కాంగ్రెసుకు మరో నేత గుడ్ బై