Asianet News TeluguAsianet News Telugu

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా: అసెంబ్లీ సెక్రటరీకి ఆఫీస్‌కి చేరిన లేఖలు

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా పత్రాలు అసెంబ్లీ సెక్రటరీకి సోమవారం నాడు చేరాయి.
 

Former minister Ganta Srinivasa Rao resignation letters reached to assembly secretary office lns
Author
Visakhapatnam, First Published Feb 15, 2021, 3:17 PM IST


విశాఖపట్టణం: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా పత్రాలు అసెంబ్లీ సెక్రటరీకి సోమవారం నాడు చేరాయి.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈ నెల 12వ తేదీన స్పీకర్ ఫార్మాట్ లో గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. 

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు చేపట్టిన దీక్ష శిబిరంలోనే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. నాలుగు రకాల ఫార్మాట్ లో గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖలు సమర్పించారు.ఈ రాజీనామా లేఖలను జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబుకు గంటా శ్రీనివాసరావు అందించారు.

ఈ  రాజీనామా లేఖలను సోమవారం నాడు అసెంబ్లీ సెక్రటరీ కార్యాలయానికి చేరాయి. ఈ రాజీనామా విషయమై అధికార వైఎస్ఆర్‌సీపీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు గాను గంటా శ్రీనివాసరావు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలను సమర్పించారు.రాజీనామాల విషయంలో తనపై వస్తున్న విమర్శలను ఆయన తప్పుబట్టారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios