ఒంగోలు: మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు హితేష్ చెంచురామ్‌లు వైసీపీకి సోమవారం నాడు రాజీనామా చేశారు.ఈ మేరకు తమ రాజీనామా అంశాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఫోన్‌ ద్వారా సమాచారం  ఇచ్చారు.

Also Read:దగ్గుబాటి రాజకీయ సన్యాసం: పురంధేశ్వరికి మోడీ బంపర్ ఆఫర్

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో  జరిగిన ఎన్నికల్లో  రామనాథం బాబు తనకు వ్యతిరేకంగా  పనిచేశారని  దగ్గుబాటి వెంకటేశ్వరరావు గుర్తు చేశారు.దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరడంతో అప్పటివరకు వైసీపీ పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్న రామనాథంబాబు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. 

Also Read:పొమ్మనలేక పొగబెట్టారా.?: వైసీపీకి దగ్గుబాటి గుడ్ బై, పురంధేశ్వరికి అడ్డుకాకూడదని....

రామనాథం బాబు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి ఏలూరి సాంబశివ రావు  విజయం ాసాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా హితేష్ పోటీ చేయాలని బావించారు. అయితే అమెరికా పౌరసత్వం కారణంగా హితేష్ పోటీ చేయడానికి సాంకేతిక సమస్యలు అడ్గుగా వచ్చాయి. దీంతో హితేష్ కు బదులుగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి ఏలూరి సాంబశివరావు చేతిలో ఓటమి పాలయ్యాడు.

Also read:జగన్ షరతు బేఖాతరు: బిజెపిలోనే పురంధేశ్వరి, హితేష్ కన్నీటి పర్యంతం

 

ఏపీ రాష్ట్రంలో టీడీపీ ఓటమి పాలై వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఏపీ సీఎం జగన్ పై మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరీ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలో పురందేశ్వరీ తీరుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదే విషయమై పురంధేశ్వరీ కూడ వైసీపీలో చేరేలా చూడాలని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావును కోరారు. కానీ, ఈ విషయమై దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులతో చర్చించారు.

ఇదే సమయంలో రామనాథం బాబును తిరిగి వైసీపీలో చేర్చుకొన్నారు. ఈ విషయం మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనకు తెలియదని తన సన్నిహితుల వ్యక్తం చేసినట్టుగా సమాచారం.

ఈ పరిణామాలపై ఏపీ సీఎం జటన్ తో దగ్టుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు ఆయనకు అపాయింట్ మెంట్ లభ్యమైంది. అయితే కుటుంబమంతా ఒకే పార్టీలో ఉండాల్సిన అవసరాన్ని దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు జగన్ వివరించారు. పురంధేశ్వరీని కూడ వైసీపీలో చేర్పించాలని కోరారు.

తాము వైసీపీలో చేరే సమయంలో కూడ పురంధేశ్వరీ బీజేపీలోనే ఉంటుందని చెప్పిన విషయాన్ని దగ్గుబాటి వెంకటేశ్వరరావు జగన్ కు గుర్తు చేశారని అంటున్నారు. ఈ పరిణామాలపై అమెరికా నుండి వచ్చిన పురందేశ్వరీతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు చర్చించారు.

జగన్ పెట్టిన షరతులకు తలొగ్గకుండా ఉండేందుకు గాను వైసీపీని వీడాలని నిర్నయం తీసుకొన్నారు. ఈ మేరకు సోమవారం నాడు వైసీపీని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన తనయుడు హితేష్ రాజీనామా చేశారు.

ఈ విషయాన్ని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఫోన్ చేసి చెప్పారు.