దగ్గుబాటి రాజకీయ సన్యాసం: పురంధేశ్వరికి మోడీ బంపర్ ఆఫర్
భార్య, కొడుకు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని దగ్గుబాటి వెంకటేశ్వర్రావు రాజకీయంగా సైలెంట్ అయిపోవాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు.
ఇరు తెలుగు రాష్ట్రాల్లో దగ్గుబాటి కుటుంబ రాజకీయ నిర్ణయాలపై చర్చ నడుస్తుంది. ఎన్నికలు ముగిసిన నాటి నుండే జగన్ ఒకింత భార్య భర్తలు రెండు వేర్వేరు పార్టీల్లో ఉండడం,అందునా దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలి హోదాలో జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శులు చేస్తుండడం జగన్ కు నచ్చలేదు. దీనిపై ఒకింత అసంతృప్తిగానే ఉన్న జగన్ గత కొన్ని రోజుల కింద ఈ విషయమై ఏదో ఒకటి తేల్చుకోవాలని చెప్పారు.
తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న తప్పులనే సీఎం జగన్ చేస్తున్నారంటూ పదేపదే విమర్శించారు. అలాగే రాజధాని విషయంలో కూడా జగన్ తో విబేధించారు. వైసీపీ ప్రభుత్వంపై దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యలను సీఎం జగన్ సీరియస్ గా తీసుకున్నారు.
ఇటీవలే సీఎం జగన్ తో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన కుమారుడు హితేష్ చెంచురాంతో కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ భార్య భర్తలు ఇద్దరూ వేర్వేరు పార్టీలో ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇద్దరూ ఒకే పార్టీలో ఉండాలంటూ జగన్ కండీషన్ పెట్టారు.
also read#జగన్ షరతు బేఖాతరు: బిజెపిలోనే పురంధేశ్వరి, హితేష్ కన్నీటి పర్యంతం
భార్య, కొడుకు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని దగ్గుబాటి వెంకటేశ్వర్రావు రాజకీయంగా సైలెంట్ అయిపోవాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. కేంద్రం నుంచి వస్తున్న సమాచారం మేరకు మోడీ సర్కార్ మంత్రివర్గాన్ని విస్తరించేందుకు ఆసక్తి కనబరుస్తునట్టు తెలుస్తుంది.
అన్ని రాష్ట్రాలకు ఒక కేంద్ర మంత్రిని ఇచ్చిన మోడీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవ్వరికి అవకాశం కల్పించలేదు. ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర అభివృద్ధి పనులను, పథకాలను ప్రారంభించడానికి ఏ మంత్రి లేకుండా పోయారు. ఇలా కేంద్ర మంత్రి పదవికి మొత్తంగా ముగ్గురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
జివిఎల్ నరసింహ రావు, సుజనా చౌదరి,పురంధేశ్వరి. వీరిలో జివిఎల్,సుజనాలకు అంత ఫాలోయింగ్,మాస్ అప్పీల్ లేవు. పురంధేశ్వరికి బలమైన కమ్మ సామాజికవర్గ సపోర్ట్ ఉండడమే కాకుండా, ఎన్టీఆర్ కూతురు కూడా. ఇది ఔనన్నా కాదన్నా పురంధేశ్వరికి ఆడెడ్ అడ్వాంటేజ్.
also read#పొమ్మనలేక పొగబెట్టారా.?: వైసీపీకి దగ్గుబాటి గుడ్ బై, పురంధేశ్వరికి అడ్డుకాకూడదని....
పురంధేశ్వరి గనుక బీజేపీలోకి చేరితే టీడీపీ నుంచి వలసలు పెరుగుతాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ కోణంలో బీజేపీ ప్రధానంగా ఆలోచించి పురంధేశ్వరి వైపు మొగ్గు చూపెడుతుంది. బీజేపీ కూడా దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు వైసీపీలో ఉండడం తో వారు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టు తెలుస్తుంది.
ఈ సమాచారం మేరకే దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు రాజకీయాలకు దూరంగా రాజకీయ సన్యాసం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇటు పురంధేశ్వరి అయినా, అటు వెంకటేశ్వర్ రావు అయినా ఇద్దరి ఆలోచనంతా కొడుకు హితేష్ చెంచు రామ్ గురించే. అందుకోసమనే పురంధేశ్వరి బీజేపీలో కొనసాగడానికి, దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి కారణంగా తెలియవస్తుంది.
కొడుకు హితేష్ చెంచు రామ్ త్వరలోనే బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తుంది. భవిష్యత్తులో దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు బీజేపీలో చేరే ఆస్కారం కూడా లేకపోలేదు.