Asianet News TeluguAsianet News Telugu

జగన్ తో నాకు గొడవల్లేవ్ కానీ అక్కడే చెడింది : అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్ తో తనకు వ్యక్తిగత విబేధాలు లేవని చెప్పుకొచ్చారు అచ్చెన్నాయుడు. జగన్ ను తాను వ్యతిరేకించడం లేదని ఆయన తప్పుడు నిర్ణయాలను మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. 

Former Minister Atchannaidu sensational comments on ys jagan &pawan kalyan
Author
Amaravathi, First Published Dec 4, 2019, 3:34 PM IST

అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి అచ్చెన్నాయుడు. వైసీపీ మంత్రులు నోరు తెరిస్తే బూతులు తప్ప మంచి మాటలు ఏమీ రావడం లేదని విమర్శించారు.  

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వయసు, ఆయనకు ఉన్న అనుభవానికి అయినా కూడా మంత్రులు కనీసం విలువ ఇవ్వడం లేదని విమర్శించారు. 

జగన్ కేబినెట్ లో కొందరు మంత్రులు బూతుల మంత్రులుగా మారిపోయారని విమర్శించారు. మంత్రుల యెుక్క బూతు దండకం చూసి జనం భయపడుతున్నారని చెప్పుకొచ్చారు.  ప్రజా రాజధాని అమరావతిపై గురువారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. 

ఇప్పటికే అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పుకొచ్చారు. అమరావతి రాజధానిపై ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ప్రస్తావించనున్నట్లు తెలిపారు. రాజధానిపై సీఎం జగన్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు మాజీమంత్రి అచ్చెన్నాయుడు. 

ఈ సందర్భంగా జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తో తనకు వ్యక్తిగత విబేధాలు లేవని చెప్పుకొచ్చారు అచ్చెన్నాయుడు. జగన్ ను తాను వ్యతిరేకించడం లేదని ఆయన తప్పుడు నిర్ణయాలను మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. 

షాపై పవన్ వ్యాఖ్యలు: విపక్షాల్లో చీలిక, వైసీపీతో గొంతు కలిపిన మిత్రపార్టీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలన అత్యంత దరిద్రమైన పాలన అని విమర్శించారు. ప్రజలంతా జగన్ పాలనను తీవ్రంగా విమర్శిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ కలిసి ఉంటే ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చేది కాదని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు మాజీమంత్రి అచ్చెన్నాయుడు. 

ఇకపోతే రాబోయే రోజుల్లో జనసేన పార్టీతో కలిసి వెళ్లాలా వద్దా అన్నది త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం పొత్తుల అంశం అప్రస్తుతం అని చెప్పుకొచ్చారు. బీజేపీతో పవన్ కళ్యాణ్ దూరంగా లేరన్నది ఎంత నిజమో తాము కూడా బీజేపీకి దూరం కాలేదన్నారు. 

సిట్ కాదు జగన్ విచారించినా పరవాలేదు...కానీ...: అచ్చెన్నాయుడు

Follow Us:
Download App:
  • android
  • ios