అమరావతి: ప్రధాని నరేంద్రమోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షాలాంటి నేతలే కరెక్ట్ అన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. పవన్ వ్యాఖ్యలప ప్రభావంతో ఏపీలోని విపక్షాల్లో చీలిక వచ్చినట్లైంది. బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకే జగన్ బీజేపీపై ప్రేమ ఒలకబోస్తున్నారంటూ వైసీపీ ఆరోపిస్తోంది.  

బీజేపీలో జనసేనను విలీనం చేసే ప్రయత్నాల్లో భాగంగానే పవన్ కళ్యాణ్ మోదీ, షాలను వెనకేసుకు వస్తున్నారంటూ ఏపీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, అవంతి శ్రీనివాస్, పేర్ని నానిలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అందువల్లే మోదీలను పొగుడుతున్నారంటూ విమర్శిస్తున్నారు. 

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అధికా పార్టీ తీవ్ర విమర్శలు చేస్తున్నా గతంలో పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించిన మిత్ర పక్షాలు మాత్రం వేర్వేరుగా స్పందిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ నేతలు సమర్థిస్తున్నారు. 

బీజేపీకి దగ్గరే .. దూరమయ్యానని ఎవరు చెప్పారు: పవన్ కీలక వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ బీజేపీపి దూరమయ్యారని ఏనాడు చెప్పలేదని బీజేపీతో ఆయనకు ఉన్న అభిప్రాయాన్ని తెలియజేశారని అందులో తప్పేంటని మాజీమంత్రి అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. పవన్ వ్యాఖ్యలపై మంత్రులు చేస్తున్న విమర్శలు అత్యంత దారుణమంటూ తిట్టిపోశారు. 

ఇదిలా ఉంటే నిన్న మెున్నటి వరకు పవన్ కళ్యాణ్ పార్టీకి మిత్రపక్షమైన సీపీఐ పార్టీ మాత్రం ఖండిస్తోంది. మోదీ, షాలను పవన్ కళ్యాణ్ వెనకేసుకు రావడం సరికాదంటుంది. మోదీ, షాలు రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. 

నేను మోదీతో చేతులు కలిపితే జగన్ సీఎం అయ్యేవాడా, వైసీపీ ఉండేదా: పవన్ కళ్యాణ్

ప్రాంతీయ పార్టీల నేతలను  మోదీ, షాలు భయపెడుతున్నారని అలాంటి వ్యక్తులు కరెక్టా అని నిలదీశారు. ఎందుకు కరెక్టో పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని వారిని ఎలా వెనకేసుకు వస్తారంటూ విరుచుకుపడ్డారు. 

మెుత్తానికి ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా నిలిచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ అధికార వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే మోదీ, షాలాంటి వ్యక్తులు కరెక్ట్ అని వారైతేనే ఉక్కుపాదంతో తొక్కేస్తారంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 

ఢిల్లీ కేంద్రంగా పవన్ వ్యూహం: జగన్ పై పవర్ అటాక్, డైరెక్షన్ వారిదేనా