నన్ను ఓడిస్తే రాజకీయాలకు గుడ్‌బై: లోకేష్ కు అనిల్ సవాల్

వచ్చే ఎన్నికల్లో తనను ఓడిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని  మాజీ మంత్రి అనిల్ కుమార్  లోకేష్ కు సవాల్ విసిరారు.

Former Minister  Anil Kumar  Challenges  To  TDP General Secretary  Nara Lokesh lns

నెల్లూరు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  తనను ఓడిస్తే  రాజకీయాల నుండి తప్పుకుంటానని  మాజీ మంత్రి అనిల్ కుమార్  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు సవాల్ విసిరారు.టీడీపీ జాతీయ  ప్రధాన కార్యదర్శి  లోకేష్ యువగళం  పాదయాత్ర  ఉమ్మడి నెల్లూరు  జిల్లాలో సాగుతుంది. ఈ సందర్భంగా  మాజీ మంత్రి అనిల్ కుమార్ పై  లోకేష్ విమర్శలు  చేశారు. ఈ విమర్శలకు  మాజీ మంత్రి అనిల్ కుమార్ స్పందించారు.

శుక్రవారంనాడు మాజీ మంత్రి అనిల్ కుమార్ నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. తనను  వచ్చే ఎన్నికల్లో ఓడించే దమ్ము లోకేష్ కు  ఉందా అని ఆయన ప్రశ్నించారు. తనపై  నెల్లూరులో పోటీ చేసి గెలవాలని  లోకేష్ కు సవాల్ విసిరారు.  తన సవాల్ ను  లోకేష్ ఎందుకు స్వీకరించడం లేదని ఆయన  ప్రశ్నించారు. తన సవాల్ పై నేరుగా  స్పందించకుండా  డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నారని  మాజీ మంత్రి అనిల్ కుమార్ చెప్పారు.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  తనను అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చేసేందుకు  తనపై  ఎవరైనా పోటీ చేయాలని  మాజీ మంత్రి అనిల్ కుమార్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను ఓటమి పాలైతే  రాజకీయాల  నుండి తప్పుకుంటానని  తేల్చి చెప్పారు. తన  సవాల్ పై  లోకేష్ స్పందించాలని  మాజీ మంత్రి అనిల్ కుమార్  చెప్పారు.

 నాలుగు రోజుల క్రితం  మాజీ మంత్రి అనిల్ కుమార్ నుద్దేశించి లోకేష్ విమర్శలు  చేశారు. ఈ వ్యాఖ్యలపై  అనిల్ కుమార్ స్పందించిన విషయం తెలిసిందే.  తన సవాల్ కు  లోకేష్ స్పందించాలని  ఇవాళ మరోసారి మాజీ మంత్రి అనిల్ కుమార్  కోరారు.

ఉమ్మడి నెల్లూరు  జిల్లాపై టీడీపీ   కేంద్రీకరించింది.  ఇదే  జిల్లాలోని ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు  టీడీపీలో  చేరనున్నారు.  మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి  ఇప్పటికే  చంద్రబాబుతో  భేటీ అయ్యారు.  టీడీపీలో  చేరనున్నట్టుగా ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. మరో వైపు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  కూడ  టీడీపీ తీర్ధం పుచ్చుకొనే అవకాశం ఉంది.  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు ఇప్పటికే టీడీపీలో చేరారు. మరో వైపు  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడ టీడీపీలో  చేరనున్నారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios