Asianet News TeluguAsianet News Telugu

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడు టీడీపీ చేరిక

మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఆయన కొడుకు భూపేష్ రెడ్డిలు ఇవాళ టీడీపీలో చేరారు. తన అనుచరులతో కలిసి ఆయన టీడీపీ తీర్ధం పుచ్చుకొన్నారు.

former minister Adinarayana Reddy brother Narayana Reddy joins in TDP
Author
Kadapa, First Published Nov 26, 2021, 5:26 PM IST


అమరావతి: కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ,  నారాయణరెడ్డి, ఆయన తనయుడు భూపేష్ రెడ్డిలు శుక్రవారం నాడు చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. నారాయణరెడ్డి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడు. కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో రామ సుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి లు టీడీపీని వీడడంతో నారాయణ రెడ్డి ఇవాళ తన కొడుకుతో కలిసి టీడీపీలో చేరారు. నారాయణ రెడ్డి తనయుడు భూపేష్ రెడ్డిని చంద్రబాబు జమ్మలమడుగు ఇంచార్జీగా నియమించనున్నారు.

Jammalamadugu నియోజకవర్గంలో గతంలో Rama Subba Reddy బాబాయి శివారెడ్డి, Adi Narayana Reddy  కుటుంబాల మధ్య వైరం ఉండేది. దీంతో రెండు వర్గాల మధ్య పలువురు హత్యలకు గురయ్యారు. siva Reddyని కూడా ప్రత్యర్ధులు హత్య చేశారు.  దేవగుడి ఆదినారాయణరెడ్డి కుటుంబాలు చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వైఎస్ జగన్ వైసీపీ ఏర్పాటు చేసిన తర్వాత ఆదినారాయణరెడ్డి సహా ఆయన సోదరులంతా ycp లో చేరారు. 2014 ఎన్నికల్లో  జమ్మలమడుగు నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఆదినారాయణరెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన Tdpలో చేరారు. చంద్రబాబు మంత్రివర్గంలో కూడా ఆయన మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

also read:జమ్మలమడుగులో మారుతన్న సమీకరణాలు: ఈ నెల 20న టీడీపీలోకి దేవగుడి నారాయణరెడ్డి

అయితే ఆది నారాయణరెడ్డి టీడీపీలో చేరడాన్ని రామ సుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే అప్పట్లో చంద్రబాబు రామ సుబ్బారెడ్డిని ఒప్పించారు. రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. 2019 ఎన్నికల్లో జమ్మలమడుగు నుండి రామ సుబ్బారెడ్డి పోటీ చేయగా, కడప ఎంపీ స్థానం నుండి ఆది నారాయణరెడ్డి బరిలో నిలిచారు. ఈ ఇద్దరు ఓటమి పాలయ్యారు.  ఎన్నికల తర్వాత  మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీలో ఆయన కీలక నేతగా ఉన్నారు. ఆదినారాయణరెడ్డి తర్వాత రామసుబ్బారెడ్డి కూడా టీడీపీని వీడారు.  


రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. ఈ తరుణంలో  జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి ఇంచార్జీ లేకుండా పోయారు. ఈ తరుణంలో ఆదినారాయణరెడ్డి సోదరుడు నారాయణరెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకన్నారు. నారాయణరెడ్డి తన కొడుకు భూపేష్ తో పాటు ఇవాళ టీడీపీలో చేరారు.  నారాయణరెడ్డి, భూపేష్ రెడ్డిలు గత మాసంలోనే టీడీపీలో చేరాల్సి ఉంది. అయితే టీడీపీ కార్యాలయంపై దాడి , ఆ తర్వాత చంద్రబాబు ఢిల్లీ టూర్ నేపథ్యంలో ఈ చేరిక వాయిదా పడింది. ఇవాళ జమ్మలమడుగు నేతలు టీడీపీలో చేరారు.దేవగుడి కుటుంబం నుండే  నారాయణరెడ్డి టీడీపీలో చేరడంతో మరోసారి ఈ నియోజకవర్గంలో  టీడీపీ కి పూర్వ వైభవం వస్తోందా లేదో అనే విషయమై కాలమే నిర్వహించనుంది.

పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు: చంద్రబాబు

 ఏపీ సీఎం వైఎస్ జగన్ పై చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు. సినిమా టికెట్లు ఆన్ లైన్ లో పెట్టి అప్పు తెచ్చుకొంటున్నారన్నారు. ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వం విక్రయిస్తుందని ఆయన మండిపడ్డారు. వలస పక్షలకు ఇక పార్టీలో చేరే అవకాశం లేదన్నారు. ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారో ఎవరు పనికోసం పనిచేస్తున్నారో రాసి పెడుతున్నట్టుగా చంద్రబాబు చెప్పారు. పనిచేసే వారికే పార్టీలో పదవులు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. పార్టీ మారి వచ్చే వాళ్లకు అవకాశం ఉండదని ఆయన చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios