స్కిల్ డెవలప్‍మెంట్ కేసు : నేను అప్రూవర్ గా మారాననే ప్రచారం అవాస్తవం... మాజీ ఐఏఎస్ పీవి రమేశ్
స్కిల్ డెవలప్‍మెంట్ కేసు మీద మాజా ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అప్రూవర్ గా మారాననే ప్రచారం అవాస్తవమని, సీఐడీ తీరుపై అనుమానాలున్నాయన్నారు.

అమరావతి : చంద్రబాబు హయాంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారిగా పనిచేసిన మాజీ ఐఏఎస్ పీవీ రమేశ్ స్కిల్ డెవలప్‍మెంట్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే కేసులో సీఐడీకి పీవీ రమేశ్ లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ... నా స్టేట్‍మెంట్ ఆధారంగానే కేసు పెట్టారనడం దిగ్భ్రాంతికరం అన్నారు. నా వాంగ్మూలంతో చంద్రబాబును అరెస్ట్ చేశారనటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
నేను అప్రూవర్ గా మారాననే ప్రచారం అవాస్తవం అని కొట్టిపారేశారు. అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారు? అని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్‍మెంట్ లో ఆర్థికశాఖ ఏ తప్పు చేయలేదన్నారు. సీఐడీ తీరుపై తనకు అనుమానం కలుగుతోందన్నారు. తాను చెప్పింది సీఐడీ తమకు అనుకూలంగా మార్చుకుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు.
చంద్రబాబు చేసిన పాపాలకు ప్రతిఫలంగానే ఇప్పుడు జైలు... లక్ష్మీపార్వతి (వీడియో)
నిధులు విడుదల చేసిన వారిలో కొందరి పేర్లు కేసులో లేవన్నారు. స్కిల్ డెవలప్‍మెంట్ ఎండీ, కార్యదర్శిల పేర్లు ఎందుకు లేవు? అని ప్రశ్నించారు. ఎండీ, కార్యదర్శిల పాత్రే ప్రధానం, వారి పేర్లు ఏవి? అన్నారు. నోట్ ఫైల్స్ లేకుండా ఈ కేసు ఎస్టాబ్లిష్ చేయలేరని, నోట్ ఫైల్స్ కనిపెట్టడం ముందుగా సీఐడీ చేయాల్సిన పని అన్నారు.
స్కిల్ కార్పోరేషన్ నోట్ ఫైల్స్ మాయం చేశారని, ఆర్ధికశాఖ షాడో ఫైల్ అధారంగా ఈ కేసు పెట్టారన్నారు. నోట్ ఫైల్స్ లేకుండా చంద్రబాబు ఓరల్ గా ఆదేశాలు ఇవ్వలేరని, ఎందరో సీఎంల దగ్గర పనిచేసిన అనుభవంతో చెప్తున్నానని చెప్పుకొచ్చారు. సీఐడీకి తాను చెప్పింది వేరని స్పష్టం చేశారు. సీఎస్, సెక్రటరీని ఈ కేసు నుంచి మినహాయించడం కుదరదు అన్నారు.