Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ సీఎం ట్రాప్ లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ - బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి

తెలంగాణ  సీఎం కేసీఆర్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై ఏపీ బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ సీఎం, మంత్రులు విశాఖ ఉక్కు కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

Former CBI JD Lakshminarayana in Telangana CM trap - BJP leader Vishnuvardhan Reddy..ISR
Author
First Published Apr 21, 2023, 9:22 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ ట్రాప్ లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పడ్డారని బీజేపీ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వస్వామి వారిని గురువారం ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముసిగిన తరువాత ఆంధ్రప్రదేశ్ లో ఓ ప్రాంతీయ పార్టీ కనిపించకుండా పోతుందని అన్నారు.

యువకుడిపై అత్యాచారం.. బస్సులో నుంచి దించి మరీ దారుణం.. వీడియో తీసి డబ్బులు వసూలు..

ఏపీలో బీజేపీలో ఎదుగుతోందని తెలిపారు. కుటుంబ రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తమ పార్టీ బలపడుతోందని చెప్పారు. విశాఖ ఉక్కును కేంద్రంగా చేసుకొని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్, అక్కడి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు పాలిటిక్స్ చేస్తున్నారని విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపణలు గుప్పించారు. సీఎం కేసీఆర్ ట్రాప్ లో పడిన లక్ష్మీనారాయణ విశాఖ ఉక్కును కాపాడుకుంటామని అంటున్నారని తెలిపారు. ఓ కంపెనీ తరఫున టెండర్లు వేస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు. క్రౌడ్ ఫండింగ్ పేరుతో నిధులు సమకూర్చుకుంటామని చెబుతూ పాలిటిక్స్ చేస్తున్నారని విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు.

స్పీడ్ బ్రేకర్ ఎక్కిన ఆర్టీసీ బస్సు.. కుదుపు వల్ల వెనుక గ్లాస్ పగిలి కిందపడ్డ విద్యార్థులు.. వీడియో వైరల్

విఖాఖ ఉక్కు అంశాన్ని పాలిటిక్స్ కోసం ఉపయోగించుకోవడం సరైంది కాదని బీజేపీ నాయకుడు అన్నారు. తెలంగాణ రాజధానిలోని ఉస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ పై ఉన్న తెలుగుతల్లి విగ్రహాన్ని తొలగించేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. అలాంటి నాయకుడు భారతీయ రాష్ట్ర సమితి పార్టీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మంచి చేస్తారని ఆయన అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios