యువకుడిపై అత్యాచారం.. బస్సులో నుంచి దించి మరీ దారుణం.. వీడియో తీసి డబ్బులు వసూలు..
ఓ యువకుడిపై మరో యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.
అతడో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఎప్పటిలాగే ఓ బస్సులో ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ యువకుడు అతడితో గొడవ పడ్డాడు. తన స్నేహితులకు ఫోన్ చేసి పిలిపించాడు. వారు వచ్చి బస్సును ఆపి ఆ యువకుడిని బయటకు తీసుకొచ్చారు. ఓ కొలను దగ్గరికి తీసుకెళ్లారు. ఆ స్నేహితుల్లో ఒకరు అతడిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిని మిగితా స్నేహితులు వీడియో తీశారు. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.
జమ్మూకాశ్మీర్ పూంచ్ లో భారీ ఉగ్రదాడి.. ఐదుగురు జవాన్లు మృతి.. దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం తిరుచ్చికి చెందిన 27 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఓ బస్సుల్లో పుత్తానందం నుంచి మనప్పరై ప్రయాణిస్తున్నాడు. అదే బస్సుల్లో వండపేట ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల అరివళగన్ కూడా ప్రయాణిస్తున్నాడు. అయితే ఉన్నట్టుండి ఒక్క సారిగా అరివళగన్ తన ఫ్రెండ్స్ కు కాల్ చేశాడు. ఓ వ్యక్తితో తనతో గొడవకు దిగాడని వారితో చెప్పాడు. అందరూ మణప్పరై దగ్గర ఉన్న కొలను సమీపంలోకి వచ్చేయాలని సూచించాడు.
జమ్మూకాశ్మీర్ పూంచ్ లో భారీ ఉగ్రదాడి.. ఐదుగురు జవాన్లు మృతి.. దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ
దీంతో ఐదుగురు ఫ్రెండ్స్ వచ్చారు. ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను బస్సులో నుంచి లాక్కెళ్లారు. అతడిని మణప్పరై కొలను దగ్గరకు బలవంతంగా పట్టుకెళ్లారు. అక్కడ అరివళగన్ స్నేహితుల్లో ఒకరైన 24 ఏళ్ల రియాజ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణాన్ని మిగితా స్నేహితులు తమ సెల్ ఫోన్లలో వీడియో తీశారు. డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో నిస్సాహయ స్థితిలో ఉన్న బాధితుడు ఏం చేయాలో తెలియక వారికి రూ.75 వేలను పంపించాడు.
ఈ ఘటనపై తరువాత బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. నిందితులపై ఫిర్యాదు చేశాడు. అనంతరం పోలీసులు ఆరుగురుని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఇద్దరు గతంలో ఓ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిని పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. ఈ కేసుపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.