నా సోదరుడు టీడీపీలో చేరాక ఇంటికి వెళ్లలేదు: నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు పార్టీ తన సేవలను ఎలా ఉపయోగించుకొంటే అలా పనిచేస్తానని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.
విజయవాడ: పదవులు ఆశించి బీజేపీలో చేరలేదని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారిగా ఆయన విజయవాడ వచ్చారు. బుధవారంనాడు బీజేపీ కార్యాలయంలో కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ సభ్యత్వం ఆశించి తాను ఆ పార్టీలో చేరినట్టుగా కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అస్తవ్యస్త నిర్ణయాలతో ఆ పార్టీ బాగా దెబ్బతిందన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిని ఇస్తామన్నారు. కానీ పీసీసీ అధ్యక్ష పదవి వద్దని చెప్పానన్నారు. నీళ్ల సీసా కిందపడకముందే జాగ్రత్తపడాలన్నారు. కిందపడి పగిలాక నీళ్లను సీసాలో పోయలేమని చెప్పానని కాంగ్రెస్ అధిష్టానానికి తాను సూచించినట్టుగా కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. కానీ తన మాటను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్టించుకోలేదని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.
ప్రజలకు మేలు చేయవచ్చనే నమ్మకంతోనే బీజేపీలో చేరినట్టుగా కిరణ్ కుమార్ రెడ్డి వివరించారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాలతో ఆ పార్టీ ఒక్కో రాష్ట్రంలో బలహీనపడుతూ వచ్చిందన్నారు. ఎయిరిండియాను నష్టాలు వస్తుందని కేంద్రం విక్రయించిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా నష్టాల్లో ఉందని కేంద్రం విక్రయించాలని నిర్ణయం తీసుకుంందన్నారు.
హైద్రాబాద్‌లోనే పుట్టా
తాను హైద్రాబాద్ లో పుట్టినట్టుగా కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. తాను ఇప్పటికి హైద్రాబాద్ లో ఉంటున్నానన్నారు. ఇప్పుడు కూడా హైద్రాబాద్ లో ఉంటున్నానని ఆయన చెప్పారు. తనది . చిత్తూరు జిల్లాలోని వాయల్పాడు అసెంబ్లీ స్థానం నుండి గతంలో తాను ఎమ్మెల్యేగా పనిచేసిన విషయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. తనకు బెంగుళూరులో కూడా ఇల్లు ఉందన్నారు. తొలుత తాను భారతీయుడినని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. కష్టపడి పనిచేస్తే పదవులు వస్తాయన్నారు. పోటీ చేయాలా వద్దా అనేది పార్టీ నిర్ణయిస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
నా సోదరుడు టీడీపీలో చేరాక ఇంటికి వెళ్లలేదు
తన రాజకీయ జీవితం తనదన్నారు. తన సోదరుడు రాజకీయ జీవితం తనదేనన్నారు. తన సోదరుడు టీడీపీలో చేరిన తర్వాత ఇంటికి వెళ్లలేదన్నారు.. తన స్వగ్రామానికి వెళ్తే గెస్ట్ హౌస్ లో ఉంటానని ఆయన చెప్పారు. తన స్వగ్రామంలో ఇల్లు కట్టుకుంటున్నట్టుగా కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.