Asianet News TeluguAsianet News Telugu

టీటీడీకి ఏడాదిగా నిలిచిపోయిన విదేశీ విరాళాలు..

తిరుమల తిరుపతి దేవస్థానానికి విదేశాల నుంచి వచ్చే నిధులు దాదాపు ఏడాదిగా నిలిచిపోయాయి. కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న టీటీడీకి ఇది మరింత ఇబ్బందిగా మారింది. 

Foreign donations to TTD stalled for a year ..
Author
Tirupati, First Published Jan 4, 2022, 1:12 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి ఏడాదిగా విదేశాల నుంచి వ‌చ్చే విరాళాలు ఏడాదిగా నిలిచిపోయాయి. దీంతో టీటీడీకి వ‌చ్చే రూ.50 కోట్లు ఆగిపోయాయి. విదేశాల నుంచి ఏదైనా సంస్థ విరాళాలు పొందాలంటే కేంద్ర హోం శాఖ అందించే ఒక లైసెన్సు పొందాల్సి ఉంటుంది. దీనిని ప్ర‌తీ సంవ‌త్స‌రం రెన్యువ‌ల్ చేయించాల్సి ఉంటుంది. అయితే ఈ లైసెన్స్‌ను టీటీడీ ఏడాదిగా రెన్యువ‌ల్ చేయించ‌లేదు. దీంతో విదేశీ విరాళాలు నిలిచిపోయాయి. 

కేంద్ర మంత్రి గడ్కరీలో సీఎం జగన్ భేటీ... విశాఖ అభివృద్దిపై చర్చ

గ‌త‌ యూపీఏ హ‌యాంలో ఇలాంటి విష‌యాల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కానీ ఇప్పుడున్న ఎన్‌డీఏ ప్ర‌భుత్వం ప్ర‌తీ విష‌యాన్ని నిశితంగా ప‌రిశీలిస్తోంది. రూల్స్ ప‌క‌డ్బందీగా అమ‌లు చేస్తోంది. ప‌లు సంస్థ‌లు విదేశాల నుంచి పొందే విరాళాల‌ను దుర్వినియోగం చేస్తున్నాయ‌ని ఎప్ప‌టి నుంచో ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు కేంద్రం ఇలా రూల్స్‌ను క‌చ్చితంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం ఇలా క‌ఠినంగా వ్య‌వ‌హరిస్తుండ‌టంతో చాలా సంస్థ‌లు తమ లైసెన్స్ ను రెన్యువ‌ల్ చేసుకోవ‌డం లేదు. గ‌త కొన్నేళ్లుగా ఇలా విదేశీ విరాళాలు పొందే అర్హ‌త చాలా సంస్థ‌లు కొల్పోయాయి. 

అయితే తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం 2020 చివ‌ర్లోనే రెన్యువ‌ల్ కోసం అప్ల‌య్ చేసుకున్నా.. కొత్త నిబంధ‌న‌లపై స‌రిగా దృష్టి సారించ‌క‌పోవ‌డంతో లైసెన్స్ రెన్యువ‌ల్ కాలేదు. దీంతో రూ.50 కోట్లు నిలిచిపోయాయి. ఈ విష‌యంపై ఇప్ప‌టికే టీటీడీ అధికారులు దృష్టి సారించారు. ప‌లు సార్లు దేశ రాజ‌ధానికి కూడా వెళ్లి వ‌చ్చారు. కేంద్ర ప్ర‌భుత్వ అధికారులు అడిగిన అన్ని డ్యాకుమెంట్స్ అంద‌జేశారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు లైసెన్స్ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. అయితే త‌న ప‌రిశీల‌నలో మాత్రం ఉంద‌ని చెబుతోంది. కేంద్ర హోం శాఖ విష‌యంలో ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో విదేశీ నిధులు నిలిచిపోయాయి. 

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో ఐఎస్ ఆఫీసర్ అమ్రపాలి భేటీ...

గ‌త రెండేళ్ల నుంచి క‌రోనా కార‌ణంగా టీటీడీకి భ‌క్తుల ర‌ద్దీ త‌గ్గింది. దీంతో ఆదాయం కూడా ప‌డిపోయింది. ఇటు ఆదాయం లేక‌పోవ‌డం, విదేశాల నుంచి వ‌చ్చే నిధులు రాక‌పోవ‌డంతో టీటీడీ ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్ప‌టికే ఏడాది నుంచి రావాల్సిన నిధుల‌న్నీ కోల్పొయిన‌ట్ల‌య్యింది. అంటే 2020 సంవ‌త్స‌రంలో మాత్ర‌మే విదేశీ నిధులు అందాయి. 2021 సంవ‌త్సరానికి ఎలాంటి నిధులు రాలేదు. మ‌రి ఇప్పుడు 2022 లైసెన్స్ కూడా రాలేదు. ఈ ఏడాది లైసెన్స్ అందినా ఈ ఏడాది వ‌ర‌కు దాదాపు మ‌రో రూ.50 కోట్ల నిధులు అందుతాయి. అయితే గ‌తేడాదిలో విదేశాల నుంచి రావాల్సిన రూ.50 కోట్ల విష‌యంలో మాత్రం ఇప్పుడు ఎలాంటి స్ప‌ష్టత లేదు. ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వమే స్పందించాల్సి ఉంది. ఈ కొత్త ఏడాది లైసెన్స్ త్వ‌రగా టీటీడీ పొందితే ఇప్ప‌టి నుంచి విరాళాలు అందే అవకాశం ఉంటుంది. క‌రోనా వ‌ల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న టీటీడీకి ఈ నిధులు ఎంతో ఉప‌యోక‌రంగా ఉంటాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios