Asianet News TeluguAsianet News Telugu

YS Jagan Delhi Tour: కేంద్ర మంత్రి గడ్కరీలో సీఎం జగన్ భేటీ... విశాఖ అభివృద్దిపై చర్చ

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి న్యూడిల్లీ పర్యటన రెండోరోజు సాగుతోంది. కొద్దిసేపటి క్రితమే జగన్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసారు. 

ap cm ys jagan delhi tour...meeting with union minister nitin gadkari
Author
New Delhi, First Published Jan 4, 2022, 12:41 PM IST

న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan) సోమవారం దేశ రాజధాని న్యూడిల్లీ (new delhi)కి చేరుకుని ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi)తో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (nirmala sitharaman) ను కలిసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ(మంగళవారం) కూడా న్యూడిల్లీలోనే వుండనున్న సీఎం మరికొందరు కేంద్ర మంత్రులను కలవనున్నారు. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (nitin gadkari)తో సీఎం జగన్ భేటీ అయ్యారు. 

దాదాపు గంటలసేపు కేంద్ర మంత్రితో భేటీ అయిత సీఎం జగన్ ఇప్పటికే రాష్ట్రానికి పలు జాతీయ రహదారులను మంజూరుచేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే రాష్ట్ర అభివృద్దికి సంబంధించిన మరికొన్ని అంశాలను గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. 

ap cm ys jagan delhi tour...meeting with union minister nitin gadkari

విశాఖపట్నం (visakhapatnam) పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకూ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి డీపీఆర్‌ తయారీ అంశంపై సీఎం కేంద్ర మంత్రితో చర్చించారు. విశాఖకు ఈ రహదారి చాలా ఉపయోగకరంగా వుంటుందని... ఇది పూర్తయితే పోర్టు నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలను మరింత తొందరగా సరుకుల రవాణా చేయవచ్చని తెలిపారు. రహదారి అందుబాటులో వస్తే ఈ రాష్ట్రాలకు దూ వెళ్లే సరుకు రవాణా వాహనాలకు తక్కువ దూరం అవుతుందని తెలిపారు. 

read more  ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో ఐఎస్ ఆఫీసర్ అమ్రపాలి భేటీ...

సముద్ర తీరాన్ని ఆనుకుని బీచ్‌ కారిడర్‌ (beach coridor) ప్రాజెక్టులకు సమీపంనుంచి ఈ రోడ్డు వెళ్తుందని సీఎం తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకునేందుకు, ఈ ప్రాంతంలో పర్యాటకరంగం అభివృద్ధికి ఈ రోడ్డు నిర్మాణం అత్యంత దోహపడుతుందని జగన్ కేంద్ర మంత్రి గడ్కరీకి తెలిపారు. 

 విశాఖ నగర అభివృద్ది, పెరుగుతున్న వాహనరద్దీని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 6 లేన్ల రహదారిని నిర్మించాలని సీఎం కేంద్రమంత్రిని కోరారు. ఇక విజయవాడ తూర్పు బైపాస్‌పై గతంలో చేసిన విజ్ఞప్తిని వెంటనే పరిశీలించాలని వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత శాఖల సమన్వయంతో భూ సేకరణను వీలైనంత త్వరగా పూర్తిచేయడమే కాదు ప్రాజెక్టు ఖర్చు తగ్గించే ప్రయత్నంలో భాగంగా స్టేట్ జీఎస్టీ, రాయల్టీ మినహాయింపులు ఇస్తామన్నారు. కాబట్టి వీలైనంత త్వరగా ప్రాజెక్టు చేపట్టాలని సీఎం జగన్ విజ్ఞప్తిచేసారు.

read more  ప్రత్యేక హోదాతో పాటు విభజన హమీలు అమలు చేస్తే ఊరట: మోడీతో జగన్ భేటీ

ఇక కత్తిపూడి - ఒంగోలు కారిడార్‌లో భాగంగా చేపట్టిన ఎన్‌హెచ్‌–216 నిర్మాణానికి సంబంధించి బాపట్లలో 4 లేన్ల రోడ్డుగా విస్తరించాలని కోరారు. విద్యాసంస్థలు, పర్యాటకులు, ఎయిర్‌బేస్‌ కారణంగా ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశముందని....కాబట్టి ప్రస్తుతం బాపట్ల  మీదుగా వెళ్తున్న ఈ రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించాలంటూ కేంద్ర మంత్రి గడ్కరీకి ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి చేసారు.

ap cm ys jagan delhi tour...meeting with union minister nitin gadkari

ఇక గడ్కరీతో భేటీ అనంతరం కేంద్ర సమాచార ప్రసారాలు, క్రీడా శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ను సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసారు. ఆయనతో రాష్ట్రంలో క్రీడాభివృద్ది గురించి చర్చించారు. అలాగే ఏపీకి చెందిన ఐఎఎస్ అధికారి ఆమ్రపాలి కూడా డిల్లీ పర్యటనలో వున్న సీఎం జగన్ ను కలిసారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios