ఫ్లిప్ కార్ట్ లో ఉద్యోగాలు.. జీతం ఎంతో తెలుసా..?

First Published 24, Jul 2018, 10:55 AM IST
flipkart offering jobs to un employees in vijayanagaram
Highlights

పదో తరగతి పాస్‌/ఫెయిల్‌, ఇంటర్‌ పాస్‌/ఫెయిల్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నవారికి కంప్యూటర్‌ ఆపరేటర్లు పోస్టులు 100 ఖాళీగా వున్నాయని పేర్కొన్నారు. జీతం రూ.10 వేలు ఉంటుందని, 18 నుంచి 32 ఏళ్ల యువకులు అర్హులని తెలిపారు.

ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్  నిరుద్యోగులకు ఉద్యోగాలు ఆఫర్ చేస్తోంది. విజయనగరం జిల్లాలో ఈ నెల 26, 27వ తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలో ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని విజయనగరం జిల్లా డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావు కోరారు. పదో తరగతి పాస్‌/ఫెయిల్‌, ఇంటర్‌ పాస్‌/ఫెయిల్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నవారికి కంప్యూటర్‌ ఆపరేటర్లు పోస్టులు 100 ఖాళీగా వున్నాయని పేర్కొన్నారు. జీతం రూ.10 వేలు ఉంటుందని, 18 నుంచి 32 ఏళ్ల యువకులు అర్హులని తెలిపారు.
 
రవాణా, భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారన్నారు. వీటితో పాటు పీఎఫ్‌, ఈఎస్‌ఐ ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగ యువకులు ఈ నెల 26, 27వ తేదీల్లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు. అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూ.వీజడ్‌ఎంకెరీర్‌స్‌. కామ్‌ నందు వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. నమోదు చేసుకున్నవారికి సెల్‌ఫోన్‌ ద్వారా మెసేజ్‌ ఇస్తారని పేర్కొన్నారు. 

ఇంటర్వ్యూకు విద్యార్హత ధ్రువపత్రాలతో పాటు రెసిడెన్సీ సర్టిఫికెట్‌ను కూడా తీసుకురావాలని డీఆర్‌ డీఏ పీడీ ఓ ప్రకటనలో తెలిపారు. విజయనగరం జిల్లా అభ్యర్థులకు మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుందని వారు తెలిపారు. 

loader