ఏపీ రాజధాని అమరావతి రైతులకు రెండో విడత ప్లాట్ల కేటాయింపు కార్యక్రమం శుక్రవారం నిర్వహించనున్నట్లు డీసీ ఉమారాణి తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు తుళ్లూరు సీఆర్డీయే కార్యాలయంలో కంఫ్యూటర్‌లో లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయింపు చేస్తున్నట్లు చెప్పారు. వివిధ కారణాలరీత్యా మొదట విడత ప్లాట్లు కేటాయింపు కాని రైతులకు రెండో విడతలో కేటాయింపులు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. సీఆర్డీయే భూవ్యవహారాల డైరెక్టర్‌ చెన్నకేశవరావు, జాయింటు కలెక్టర్‌ ఇంతియాజ్‌ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. గతంలో కొందరు రైతులకు మొదటి విడత కార్యక్రమం ద్వారా ఫ్లాట్ల కేటాయింపులు చేపట్టారు. కాగా.. అప్పుడు ఫ్లాట్లు లభించని వారికి ఇప్పుడు అందజేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.