అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన ఐదుగురు ఏపీ వాసుల ఆచూకీ గల్లంతు: ఢిల్లీలో హెల్ప్ లైన్ ఏర్పాటు

అమర్ నాథ్ యాత్రకు వెళ్లినవారిలో ఐదుగురు  ఆచూకీ తెలియడం లేదని ఏపీ అధికారులు తెలిపారు. ఈ ఐదుగురి ఆచూకీ కోసం ఏపీ ప్రభుత్వ అమర్ నాథ్ లో అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది 

Five Pilgrims From Andhra Pradesh Missing In Amarnath

గుంటూరు: Amarnath యాత్రకు వెళ్లిన వారిలో ఐదుగురు ఆచూకీ తెలియడం లేదని ఏపీ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురి సమాచారం లభ్యం కాకపోవడంతో అమర్‌నాథ్ వద్ద సహాయక చర్యలు చేపట్టిన అధికారులతో ఏపీ అధికారులు సమాచారం ఇచ్చారు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన Andhra Pradesh రాష్ట్రానికి చెందిన ఐదుగురి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. దీంతో వీరి బంధువులు ఆందోళన చెందుతున్నారు.  

రాష్ట్రంలోని విజయవాడకు చెందిన వినోద్, రాజమండ్రికి చెందిన సుధ, తిరుపతికి చెందిన మధు, గుంటూరుకు చెందిన ఝాన్సీలక్ష్మి, విజయగనరానికి చెందిన నాగేంద్రలు ఆచూకీ లభ్యం కాలేదు. వీరి ఫోన్లు పనిచేయడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమర్ నాథ్ లో  అధికారులతో ఈ విషయమై మాట్లాడుతున్నారు. వీరు ఎక్కడ ఉన్నారనే విషయమై సమాచారం సేకరిస్తున్నారు. అమర్ నాథ్ యాత్రికుల కోసం ఏపీ ప్రభుత్వం ఢిల్లీలోని AP Bhavan  లో హెల్ప్ లైన్ ను కూడా ఏర్పాటు చేసింది., అమర్ నాథ్ యాత్రకు వెళ్లిన ఏపీకి చెందిన వారి సమాచారం కోసం 011 23387089 నెంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు.  Delhi లో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా ఉన్న Praveen Prakash అమర్ నాథ్ లో సహాయక చర్యలు చేపట్టిన అధికారులతో చర్చలు జరుపుతున్నారు. 

also read:Amarnath Cloudburst : కొన‌సాగుతున్న రెస్క్యూ.. 15,000 మందిని ర‌క్షించిన సిబ్బంది.. 40 మంది గ‌ల్లంతు

 ఈ నెల 8వ తేదీన అమర్ నాథ్ వద్ద  కురిసిన భారీ వర్షంతో ఒకేసారి పెద్ద ఎత్తున వరద రావడంతో  16 మంది మరణించారు. మరో 65 మంది గాయపడ్డారు.మరణించిన 16 మందిలో ఎనిమిది మంది పురుషులు, ఆరుగురు స్త్రీలు. అయితే మరో ఇద్దరిని ఇంకా గుర్తించాల్సి ఉంది.  వరద కింద చిక్కుకున్న వారు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ అధికారులు అమర్ నాథ్ వద్ద సహాయక చర్యలు చేపట్టారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios