Asianet News TeluguAsianet News Telugu

నవజాత శిశువు విక్ర‌యం.. ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు

Kakinada: కోనసీమలో నవజాత శిశువును విక్రయిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సంతానం లేని దంపతుల నుంచి శిశువును స్వాధీనం చేసుకున్న పోలీసులు తల్లికి అప్పగించారు. కాకినాడ జిల్లాలో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.
 

Five persons held for selling newborn girl in Konaseema, Kakinada RMA
Author
First Published Oct 11, 2023, 4:59 PM IST | Last Updated Oct 11, 2023, 4:59 PM IST

Kakinada: కాకినాడ జిల్లాకు చెందిన సంతానం లేని దంపతులకు అప్పుడే పుట్టిన ఆడశిశువును విక్రయించిన ఘ‌ట‌న కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ఐదుగురు నిందితులను కొత్తపల్లి రాము, పీ.బాలరాజు, ఎం.స్వర్ణ ప్రకాష్, గుణ్ణం భాను కిరణ్, ఒడ్డోరి సురేష్‌లుగా గుర్తించారు. వీరంతా కోనసీమ ప్రాంతానికి చెందినవారేన‌ని ది హిందూ క‌థ‌నం పేర్కొంది. అక్టోబరు 9న తన బిడ్డను అక్రమ దత్తతకు ఇచ్చినందుకు 34 ఏళ్ల పాప తల్లి పి.వరలక్ష్మి తన లైవ్ ఇన్ పార్టనర్ కొత్తపల్లి రాముపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో గత మూడు సంవత్సరాలుగా వరలక్ష్మి, రాము దంపతులు లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో ఉన్నారు. సెప్టెంబర్ 25న వరలక్ష్మికి ఆడపిల్ల పుట్టింది. ఆమె అమలాపురంలోని ఓ ప్ర‌యివేటు బ్యాంకులో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. అయితే, త‌న బిడ్డ‌ను ద‌త్త‌త పేరుతో విక్ర‌యించ‌డానికి రాము తన మరో ఐదుగురు స్నేహితులు కుట్ర ప‌న్నారు. త‌న బిడ్డను చట్టపరమైన ప్రక్రియ ద్వారా దత్తత కోసం ₹3.2 లక్షల నష్టపరిహారం కోసం, శిశువు గ్రహీతల ద్వారా ఇవ్వాలని ఒప్పించాడు. అక్టోబర్ 4న ఆరుగురు సభ్యులు ఆడబిడ్డను కాకినాడ జిల్లాకు తీసుకెళ్లారు, అక్కడ పిల్లలు లేని దంపతులకు శిశువును విక్రయించారని అమలాపురం డీఎస్పీ అంబికా ప్రసాద్ తెలిపారు.

ఐదుగురు సభ్యుల ముఠా బాధితురాలికి ₹ 3.2 లక్షల పరిహారం చెల్లించకుండా ₹ 1.4 లక్షలు చెల్లించింది. అయితే, బాధితురాలు తన బిడ్డను తిరిగి ఇప్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. "అక్టోబర్ 10న ఐదుగురు నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఆరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోందని" డీఎస్పీ అంబికా ప్రసాద్ తెలిపారు. పిల్లలు లేని దంపతుల నుంచి పది రోజుల పసికందును స్వాధీనం చేసుకున్న పోలీసులు బాధితురాలికి అప్పగించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios