హైదరాబాద్: విశాఖపట్టణంలోని దువ్వాడ వీఎస్ఈజడ్ లో ఐదు వజ్రాలు మాయమయ్యాయి. వీటి విలువ సుమారు 7.5 లక్షలు ఉంటుందని అంచనా. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖపట్టణంలోని డైమండ్ పాలిషింగ్ కంపెనీలో ఐదు సింథటిక్ వజ్రాలు మాయం కావడం కలకలం రేపుతోంది. ఈ విషయమై కంపెనీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కంపెనీ నుండి వజ్రాలు మాయం కావడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

కంపెనీ నుండి వజ్రాలు ఎప్పుడు మాయమయ్యాయి.. ఎవరు తీసుకెళ్లారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.