Asianet News TeluguAsianet News Telugu

కంటైనర్ నుండి సెల్‌ఫోన్లు చోరీ: 13 రోజుల్లోనే నిందితుల అరెస్ట్

గుంటూరు జిల్లాలోని మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై కంటైనర్ నుండి సెల్ ఫోన్లను చోరీ చేసే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీతో పాటు తెలంగాణ నుండి నిందితులు చోరీ చేసిన సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. 13 రోజుల్లోనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Five arrested for stealing Rs 80 lakh from container lorry
Author
Amaravathi, First Published Oct 4, 2020, 1:00 PM IST


గుంటూరు: గుంటూరు జిల్లాలోని మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై కంటైనర్ నుండి సెల్ ఫోన్లను చోరీ చేసే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీతో పాటు తెలంగాణ నుండి నిందితులు చోరీ చేసిన సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. 13 రోజుల్లోనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఈ విషయమై ఆదివారం నాడు మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది సెప్టెంబర్ 16వ తేదీన జిల్లాలోని గుంటూరు చెన్నై జాతీయ రహదారిపై సెల్‌ఫోన్ల లోడుతో వెళ్తున్న లారీ నుండి డ్రైవర్ కు తెలియకుండానే  ఈ ముఠా చోరీకి పాల్పడింది.

ఈ విషయమై లారీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.ఈ దర్యాప్తులో మహారాష్ట్రకు చెందిన కంజరభట్ కు చెందిన ముఠాగా భావిస్తున్నారు.  కంటైనర్ వెనుక భాగం నుండి టూ వీటర్ సహాయంతో  నిందితులు వెంబడిస్తారు. కంటైనర్  లారీ వెనుక నుండి లారీ సీల్ ను తీసి  కంటైనర్ లోకి ప్రవేశిస్తారు.

కంటైనర్ నుండి టిఫిన్ బాక్స్  లేదా  ఇతర వస్తువులతో బైక్ పై నుండి కంటైనర్ ను అనుసరిస్తున్న తన అనుచరులకు అందిస్తారు. కంటైనర్ నుండి సెల్  ఫోన్లను చోరీ చేసిన తర్వాత  నడుముకు టైర్ కట్టుకొని కంటైనర్ నుండి కిందకు దూకుతారు. 

ఈ ముఠాను టెక్నికల్ సహాయంతో అరెస్ట్ చేసినట్టుగా గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు. 
కంటైనర్ వెనుక భాగం పగులగొట్టి  90 లక్షల విలువైన 980 సెల్ ఫోన్లను చోరీ చేశారు.81 లక్షలు.. 76 లక్షల  సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొన్నామని ఎస్పీ తెలిపారు.

ఈ చోరీ చేసిన తర్వాత ఇదే ముఠా తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా చేగుంటలో కూడ కంటైనర్ నుండి రెండు కోట్ల విలువైన సెల్ ఫోన్లను చోరీకి పాల్పడ్డారు. వీటిలో 2.1 కోట్ల విలువైన సెల్ ఫోన్లను సీజ్ చేసినట్టుగా ఎస్పీ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios