Asianet News TeluguAsianet News Telugu

దిశ యాప్‌తో ఏపీ పోలీసుల తొలి సక్సెస్: 6 నిమిషాల్లో స్పాట్‌కి, ఆకతాయి అరెస్ట్

మహిళలు, విద్యార్ధినుల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశా యాప్ సత్ఫలితాలను ఇస్తోంది. దీని ద్వారా తొలి సక్సెస్‌ను పోలీస్ వర్గాలు అందుకున్నాయి

first success to disha app, AP police arrest a man who harassed women
Author
Vijayawada, First Published Feb 11, 2020, 3:58 PM IST

మహిళలు, విద్యార్ధినుల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశా యాప్ సత్ఫలితాలను ఇస్తోంది. దీని ద్వారా తొలి సక్సెస్‌ను పోలీస్ వర్గాలు అందుకున్నాయి. బస్సులో మహిళను వేధిస్తున్న కీచకుడిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. మంగళవారం తెల్లవారుజామున విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో తొటి మహిళా అధికారి పట్ల తోటి ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమెకు ఇటీవల ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన దిశా యాప్ గుర్తొచ్చి.. SOS ద్వారా వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.

Also Read:దిశ చట్టం అమలుకు జగన్ జాగ్రత్తలు: ఇద్దరు ప్రత్యేకాధికారుల నియామకం

ఉదయం 4.21 నిమిషాలకు మంగళగిరిలోని దిశా కాల్ సెంటర్‌కు SOS కాల్ వెళ్లింది. అక్కడి నుంచి దగ్గరలోని అత్యవసర విభాగానికి ఫోన్ వెళ్లింది. క్షణాల్లో రంగంలోకి దిగిన ఏలూరు త్రీటౌన్ పోలీసులు 04.27 నిమిషాల కల్లా అంటే కేవలం 6 నిమిషాల్లోనే బాధితురాలి వద్దకు చేరుకున్నారు.

బస్సులో వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. అనంతరం ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహిళా అధికారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిని ప్రొఫెసర్‌గా గుర్తించారు.

Also Read:మాట నిలబెట్టుకున్న జగన్: దిశా పోలీస్ స్టేషన్లు, దిశా యాప్ కూడా వచ్చేశాయ్

కాగా సకాలంలో స్పందించి నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులను ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. మరోవైపు మహిళలు-బాలికల సంరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకురావడంతో పాటు దిశ పోలీస్ స్టేషన్లను సైతం ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios