కర్నూల్: కర్నూల్‌లోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్టు నుండి విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి.

బెంగుళూరు నుండి కర్నూల్ కు తొలి విమానం ప్యాసింజర్లతో ఆదివారం నాడు చేరుకొంది.  52 మంది ప్రయాణీకులతో బెంగుళూరు నుండి కర్నూల్ కు ఇవాళ విమానం చేరుకొంది.

ఈ విమానంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్  చేరుకొన్నారు. బెంగుళూరు నుండి కర్నూల్ కు 6ఈ7911 నెంబర్ విమానం చేరుకొంది.  52 మందితో తొలి విమానం కర్నూల్ కు చేరుకోవడంతో స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి.

మరో వైపు ఇవాళ ఉదయం పదిన్నర గంటలకు కర్నూల్ ఎయిర్ పోర్టు నుండి విశాఖపట్టణానికి తొలి విమానం బయలుదేరింది.  రెండు రోజుల క్రితం ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ ఎయిర్ పోర్టును ప్రారంభించారు.

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ఈ ఎయిర్ పోర్టుకు పెడుతున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఈ ఎయిర్ పోర్టు నుండి త్వరలోనే అన్ని ప్రాంతాలకు కూడ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.