ఏడాదిలో చీలికలు పేలికలైన ఏఐఏడిఎంకె

ఏడాదిలో చీలికలు పేలికలైన ఏఐఏడిఎంకె

ఇంతలో ఎంత  మార్పు. దశాబ్దాల పాటు అప్రతిహతంగా కొనసాగిన ఏఐఏడిఎంకె హవా ఏడాదిలో చీలికలు పీలికలుగా తయారైంది. తమిళనాడులో ఇంత గట్టి పునాదులు కలిగిన పార్టీకి  హటాత్తుగా ఎందుకంత దురవస్త పట్టింది? అంటే, అమ్మ లేకపోవటమే కారణం. తమిళ ప్రజల హృదయాల్లో అమ్మగా, పురట్చి తలైవిగా పాపులరైన జె జయలలిత మరణించి మంగళవారానికి సరిగ్గా ఏడాది. అమ్మలేని ఏడాదిలోనే పార్టీలో ఇన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నదో, ఎన్ని ఒడిదుడుకులకు లోనైందో?

పార్టీపై ఆధిపత్యం కోసం చివరకు కోర్టుకు వెళ్ళటం, పార్టీ చిహ్నమైన రెండాకులను ఎవరికి చెందకుండా ఎన్నికల కమీషన్ స్తంభింపచేయటం నిజంగా దురదృష్టమే. ఇదంతా ఓ ఎత్తైతే, ఆదాయపుపన్నుశాఖ ఉన్నతాధికారులు జయలలిత నివసించిన పొయేస్ గార్డెన్ లో సోదాలు జరపటం తమిళ ప్రజలను ఎంతో వేధనకు గురిచేసింది. పార్టీకి ఇంతటి దరవస్త ఎందుకు వచ్చిందంటే అందరి వేళ్ళు జయలలిత నెచ్చెలి, సహాయకురాలు శశికళ వైపే చూపుతున్నాయి. శశికళ అత్యాసే పార్టీ ప్రస్తుత పరిస్ధతికి కారణమని అంటున్నారు అందరూ.

జయలలిత ఉన్నంత కాలం ఆమె నీడలోనే ఉన్న శశికళ జయ మరణంతో ఒక్కసారిగా తన విశ్వరూపం చూపాలనుకున్నారు. జయస్ధానంలో తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోవాలని అనుకున్నారు. అయితే, న్యాయస్ధానాల రూపంలో శశి ఆశలకు బ్రేక్ పడింది. దాంతో అమ్మ అనుంగు శిష్యునిగా, ఆపధర్మ ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వమే పూర్తిస్ధాయి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.

అయితే, పన్నీర్ సిఎంగా ఉండటం ఇష్టం లేని శశి చివరకు ఆ స్ధానంలో పళని స్వామిని కూర్చోబెట్టి కథ నడుపుదామని అనుకున్నారు. అయితే, ఎప్పుడైతే సిఎం కుర్చీలో కూర్చున్నారో అప్పటి నుండే పళనిస్వామి సొంతంగా నిర్ణయాలు తీసుకోవటం మొదలుపెట్టారు. దాంతో మళ్ళీ పళనిని కూడా దింపేయాలని శశికళ వర్గం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇంతలో అక్రమాస్తుల కేసులో శిక్ష పడ్డ శశికళను ప్రభుత్వం బెంగుళూరులోని జూలైలుకు తరలించారు. అక్కడి నుండి కూడా పళనిని దింపేసేందుకు శశవర్గం చేయని ప్రయత్నాలు లేవు.

దాంతో పార్టీపై ఆధిపత్యం కోసం అప్పటి వరకూ గొడవలు పడిన పళని స్వామి, పన్నీర్ శెల్వం వర్గాలు అనూహ్యంగా శశికళ వర్గంకు వ్యతిరేకంగా ఏకమయ్యాయి. దాంతో పార్టీ పరిస్ధితి చీలికలు పీలికలుగా తయీరైంది. ఎందుకంటే, పళని, పన్నీర్, శశివర్గాలతో చేరటం ఇష్టం లేని కొందరు ఎంఎల్ఏలు, నేతలు స్వతంత్రంగా వ్యవహరించటం మొదలుపెట్టారు. వీరిలో అత్యధికులు జయ మేనకోడలు దీపకు మద్దతు ప్రకటించారు. ఏదో కేంద్రంలోని భాజపా ఆశీస్సులతో పళని స్వామి కాలాన్ని నెట్టుకొస్తున్నారు. ఎప్పుడేమవుతుందో తెలీని పరిస్ధితి. జయలేని ఏడాదిలోనే పార్టీలో ఎన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయంటే ఆశ్చర్యంగా ఉంది.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos