ఏపీలో ప్రకాశం జిల్లాలో ఓ ట్రావెల్స్ బస్సులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ సమయంలో బస్సులో 25మందికి పైగా ప్రయాణికులున్నారు.  

ప్రకాశం : ప్రకాశం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా జరుగుమిల్లి వద్ద ఓ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్త మవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సప్రమాద సమయంలో బస్సులో 25మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వీరందరూ కిందికి దిగిపోయారు. కానీ ప్రయాణికుల లగేజీ పూర్తిగా దగ్థం అయ్యింది. 

హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెడుతున్న మోజోట్రావెల్స్ బస్సు ఇది. ప్రమాదం విషయం తెలియగానే వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలన అదుపు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.