అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాఘవులుపేటలో  ఓఎన్‌జీసీ గ్యాస్ లీకైంది. దీంతో భారీగా మంటలు వ్యాపించాయి.   స్థానికులు అధికారులకు  సమాచారం ఇచ్చారు.

కాకినాడ: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాఘవులుపేటలో ఓఎన్‌జీసీ గ్యాస్ లీకైంది. ఈ గ్యాస్ లీక్ తో మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు ఓఎన్‌జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓఎన్‌జీసీ గ్యాస్ పైప్ లైన్ లీకై పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 2005లో తూర్పుగోదావరి జిల్లాలోని తాటిపాకలో ఓఎన్‌జీసీ బావిలో పేలుడు చోటు చేసుకుంది. 2010 తాటిపాక వద్ద రెండు సార్లు గ్యాస్ పైపులైన్లు లీకేజీకి గురయ్యాయి. 

2014 జూన్ 28న అమలాపురానికి సమీపంలోని నాగారం వద్ద గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది సజీవ దహనమయ్యారు. మరో 15 మంది గాయపడ్డారు.2020 మే 18న మలికిపురం మండలం తూర్పుపాలెం వద్ద గ్యాస్ లీకైంది.అదే ఏడాది జూలై 10న తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్‌జీసీలో ప్రమాదం జరిగింది.2021 ఏప్రిల్ మాసంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారామపురం వద్ద ఓఎన్‌జీసీ గ్యాస్ పైప్ లైన్ లీకైంది2022 సెప్టెంబర్ 27న అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పాశర్లపూడి వద్ద ఓఎన్‌జీసీ గ్యాస్ లీకైంది.

ఈ ఏడాది జూన్ 16న తూర్పుపాలెం వద్ద ఓఎన్‌జీసీ గ్యాస్ పైప్ లైన్ లీకైంది. దీంతో మంటలు వ్యాపించాయి. ఈ విషయం తెలుసుకున్న ఓఎన్‌జీసీ అధికారులు నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ మంటలతో భయాందోళనలకు గురయ్యారు తూర్పుపాలెం వాసులు. మంటలను ఆర్పిన తర్వాత స్థానికులు ఇళ్లకు చేరుకున్నారు. తాజాగా మరోసారి ఓఎన్‌జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడం ప్రస్తుతం కలకలం రేపుతుంది.