విశాఖ గాజువాక హెచ్‌పీసీఎల్ లో అగ్ని ప్రమాదం: మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది
విశాఖపట్టణం గాజువాక హెచ్ పీ సీఎల్ లో ఇవాళ సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.
విశాఖపట్టణం: విశాఖపట్టణంలోని గాజువాక హెచ్‌పీసీఎల్ లో సోమవారం నాడు అగ్ని ప్రమాదం జరిగింది. హైడ్రో కార్బన్ వ్యర్ధాలు మండడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటల కారణంగా భారీగా పొగ వెలువడుతుంది. హెచ్ పీ సీఎల్ లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది హెచ్‌పీసీఎల్ లో మంటలను ఆర్పుతున్నారు.
దేశ వ్యాప్తంగా పలు పరిశ్రమల్లో ఇటీవల కాలంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రియాక్టర్లు పేలడంతో పాటు ఇతరత్రా కారణాలతో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం పోతారం పారిశ్రామికవాడలో ఈ నెల 6వ తేదీన అగ్ని ప్రమాదం జరిగింది. లియో ఫార్మా పరిశ్రమలో మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు ఫైర్ ఫైటర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. గత నెల 31న సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లిలో గల సిమెంట్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ఏడాది జనవరి 19న సికింద్రాబాద్ డెక్కన్ మాల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆరు అంతస్థులు ఈ ప్రమాదంలో దెబ్బతిన్నాయి.
also read:భూదాన్‌పోచంపల్లి ఎస్‌వీఆర్ ఫ్యాక్టరీలో పేలుడు: భయంతో పరుగులు తీసిన కార్మికులు
ఈ ఏడాది జనవరి 6వ తేదీన సంగారెడ్డి జిల్లాలోని గడ్డిపోతారంలో గల మైలాన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఈ నెల 13న న్యూఢిల్లీలోని ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది.గత నెల 31న జార్ఖండ్ లోని ధన్ బాద్ లో గల ఓ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు.